ఉపన్యాసాలిచ్చి పత్తా లేకుండా పోవడం బీజేపీ నేతలకు అలవాటైపోయిందని మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. తెలంగాణ పట్ల చిత్తశుద్ధి ఉంటే తన ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలని సవాల్ విసిరారు. ఈ మేరకు కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు బహిరంగ లేఖ రాశారు. ‘విభజన చట్టంలోని ఒక్క హామీనైనా కేంద్రం నెరవేర్చిందా? కోచ్ ఫ్యాక్టరీ గుజరాత్లో ఎలా వస్తుంది.. కాజీపేటలో ఎందుకు పెట్టరు? నవోదయ, ఐఐఎం విద్యాలయాలు ఎందుకు కేటాయించలేదు? బయ్యారం ఉక్కు పరిశ్రమ హామీకి ఎందుకు తుప్పు పట్టించారు. ఐటీ రంగంలో అగ్రస్థానంలో ఉన్న తెలంగాణకు సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్కు ఎందుకివ్వడం లేదు?’ అని ప్రశ్రల వర్షం కురిపించారు కేటీఆర్.. గుజరాత్ పై వల్లమాలిన ప్రేమను.. తెలంగాణపై సవతి తల్లి ప్రేమను కొనసాగిస్తే ప్రజాక్షేత్రంలో బీజేపీ అందుకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. తెలంగాణ సమాజం మీ నుంచి జవాబులు కోరుతున్న ప్రశ్నలివే అంటూ తన లేఖలో పేర్కొన్నారు.
- విభజన చట్టంలో తెలంగాణకు కొన్ని నిర్దిష్టమైన హామీలను పార్లమెంట్ సాక్షిగా భారత ప్రభుత్వం ఇచ్చింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెలంగాణ అంటే ప్రేమ ఉన్నట్టు చెప్పుకున్న మీ పార్టీ అధికారంలోకి వచ్చినంక ఆ హామీలను నెరవేర్చేందుకు చేసిన ప్రయత్నం ఏంటీ? విభజన చట్టంలో చెప్పిన ఏ ఒక్క హామీ అయినా మీ ప్రభుత్వం నెరవేర్చిందా?
- కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుచేయాలన్నది దశాబ్దాల డిమాండ్. ఇదే విషయాన్ని ఎన్నో సార్లు మేం అడిగితే దేశంలో కోచ్ ఫ్యాక్టరీలకు డిమాండ్ లేదని కేంద్రంలోని మీ ప్రభుత్వం చేతులు దులుపుకున్నది వాస్తవం కాదా?
- కాని నిన్న మొన్ననే 20 వేల కోట్లతో మీ సొంత రాష్ట్రం గుజరాత్ లో కోచ్ ఫ్యాక్టరీ పెట్టాలని నిర్ణయం తీసుకోవడం తెలంగాణ పై మీకున్న చిన్నచూపుకు నిదర్శనం కాదా? మీ గుజరాత్ లో కోచ్ ఫ్యాక్టరీ ఎలా వస్తుంది? మా కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఎందుకు పెట్టరో చెప్పగలరా?
- తెలంగాణ రాష్ట్రానికి NDA ఆధ్వర్యంలోని కేంద్రం ఇచ్చిన ఒక్క విద్యా సంస్థ పేరైనా మీరు చెప్పగలరా? ఐఐఎం, ఐసర్, ఏన్ఐడి, ట్రిబుల్ ఐటీ, గిరిజన విశ్వవిద్యాలయం, నవోదయ విద్యాలయాల్లో ఏ ఒక్కటి కూడా తెలంగాణకు ఎందుకు కేటాయించలేదో సమాధానం చెప్పగలరా?
- గుజరాత్ లో ఓ మెడికల్ విద్యార్థికి అడ్మిషన్ సమయంలో అన్యాయం జరిగిందని బాధపడిన ప్రధాన మంత్రి మోడీ అన్న వార్తలు చూసాము. అర్హత కల విద్యార్థికి అన్యాయం జరిగితే ప్రధాని స్పందించడం బాగుంది. కేంద్రంలో మీరు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజీ కూడా మంజూరు చేయలేదు. ఫలితంగా లక్షలాది తెలంగాణ బిడ్డలు మెడిసిన్ చదువుకోలేకపోతున్నారు. మరి మా బిడ్డలకు అన్యాయం జరుగుతుంటే ప్రధానమంత్రి మోడీకి, మీకు ఎందుకు బాధ కలగడం లేదు?
- విభజన చట్టం ప్రకారం కేంద్రం బయ్యారంలో ఉక్కు ప్యాక్టరీ ని ఏర్పాటుచేయాలి. తెలంగాణ బాగుపడితే చూడలేని మీ కక్షపూరిత వైఖరితో న్యాయంగా దక్కిన ఆ హామిని ఎందుకు తుప్పు పట్టించారో చెపుతారా?
- కొత్తగా ఏర్పడిన రాష్ట్రం అయినప్పటికీ పెట్టుబడులను ఆకర్షించడంలో తెలంగాణ నెంబర్ వన్ గా నిలుస్తున్నది. అయితే విభజన చట్టంలో ఉన్న పారిశ్రామిక రాయితీలను తెలంగాణకు ఎందుకు ఇవ్వడం లేదు?
- ఐటీ రంగంలో హైదరాబాద్ సాధిస్తున్న అభివృద్ధిని అడ్డుకోవాలన్న మీ పార్టీ, ప్రభుత్వ కుట్రలకు ఐటీఐఆర్ రద్దు పరాకాష్ట కాదా?
- ఐటిఐఆర్ ను రద్దు చేసిన మీరు అందుకు ప్రత్యామ్నాయంగా కేంద్ర ప్రభుత్వం అద్వర్యంలో హైదరాబాద్ నగరంలో ఐటీ అభివృద్ధి కోసం చేపట్టిన ఒక్క కార్యక్రమాన్ని అయినా చెప్పగలరా?
- ఐటిఐఅర్ పోవడంతో ఇక్కడి యువతకు దక్కకుండా పోయిన ఉద్యోగాలపై ఏం సమాధానం చెబుతారు ?
- దేశం ఐటీ రంగలో అగ్రగామిగా ఉన్న తెలంగాణలో ఐటి అభివృద్ధి కోసం సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఎందుకు ఇవ్వడంలేదు?
- పాలమూరు రంగారెడ్డి పథకానికి జాతీయ హోదా ఇస్తామని 2014 ఎన్నికల సభలో సుష్మా స్వరాజ్ గారు హామి ఇచ్చారు. కాని అధికారంలోకి వచ్చి ఇన్నేళ్లు గడిచినా మీరు ఇచ్చిన హామీనే ఎందుకు అమలుచేయలేదు?
- తెలంగాణకు దక్కాల్సిన 575 టియంసిల సాగునీటి వాటాల కేటాయింపులపై తెలంగాణ కోరుతున్న విధంగా బ్రిజేష్ కూమార్ ట్రిబ్యునల్ కు రెఫర్ చేయకుండా 8 ఏళ్లుగా ఎందుకు తాత్సారం చేస్తున్నారు. క్రిష్టా నది యాజమాన్య బోర్డు అనే ఒక శిఖండి సంస్ధను ఏర్పాటు చేసి, తెలంగాణకు సాగునీటి జలాల హక్కులు దక్కకుండా తాత్సారం చేస్తున్న మీరు, మీ వివక్ష పూరితతీరుపై ఏం చెప్తారు?
- 2014లో జరిగిన ఎన్నికల సభలో సుష్మా స్వరాజ్ పాలమూర్ రంగారెడ్డి పథకానికి జాతీయ హోధా ఇస్తామంటూ ఇచ్చిన, మీ పార్టీ ప్రకటించిన హమీకి ఎందుకు కట్టుబడి ఉండడం లేదు. ఈ విషయంలో పాలమూర్, రంగారెడ్డి రైతన్నలకు ఏ సమాధానం చెప్తారు? మరోవైపు పక్కనున్న కర్నాటక అప్పర్ భద్ర ప్రాజెక్ట్ కు జాతీయ హోదా ఇస్తానని ప్రకటించడం తెలంగాణ రైతాంగంపట్ల మీకున్న వివక్ష పూరిత వైఖరికి నిదర్శణం కాదా?
- తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాజ్యాంగబద్ధంగా తెలంగాణకు దక్కాల్సిన నిధులు కాకుండా ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రానికి చేసిన సహాయం ఏమిటో సమాధానం చెప్పాలి?
- మిషన్ కాకతీయ..మిషన్ భగీరథ లాంటి దేశ చరిత్రలో ఎన్నడూ ఎరుగని విప్లవాత్మక ప్రాజెక్టులకు 24 వేల కోట్లు గ్రాంట్ ఇయ్యమంటూ సాక్షాత్తూ నీతి ఆయోగ్ రికమెండ్ చేసినా ఇప్పటిదాకా పైసా విదల్చని మీ పక్షపాత వైఖరిపై ఏం చెప్తారు?
- స్కైవేల నిర్మాణం కోసం రక్షణ శాఖ భూములు అడిగితే ఏడేళ్లుగా తొక్కిపడుతూ నగర పౌరులను అవస్ధలకు గురిచేస్తున్నదినిజం కాదా?
- దేశంలో మీరు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోని నది ప్రక్షాళన ప్రాజెక్టుకు వేల కోట్లు కేటాయించుకుంటూ, మా మూసీ ప్రక్షాళన, అభివృద్దికి మూడు పైసలు కూడా కేటాయించనిది నిజం కాదా?
- హైదరాబాద్ నగరంలో చరిత్రలో ఎన్నడు ఎరగని వరదల్లో మునిగితే గుజరాత్ కు వేల కోట్ల వరద సాయం అందించి, హైదరాబాద్ కు మెండి చేయి చూపించి, నయాపైసా ఇవ్వకుండా, ఇప్పుడు ఏ మొఖం పెట్టుకుని హైదరాబాద్ వస్తున్నారు.? ఇది మీకు సిగ్గుచేటు కాదా?
- కొవిడ్ సంక్షోభ సమయంలో ప్రపంచానికి తన ఫార్మా రంగం బలంలో అండగా నిలిచి, వ్యాక్సిన్ల తయారీతో భారత దేశ ఖ్యాతిని ప్రపంచవ్యాప్తం చేసిన హైదరాబాద్ ఫార్మా రంగానికి అయువు పట్టుగా నిలిచేలా మేము ఎర్పాటు చేస్తున్న హైదరాబాద్ ఫార్మాసిటికి ఎందుకు సహాయం అందించడం లేదు?
- ఈకో సిస్టం దిక్కులేని చోటకు డిఫెన్స్ ఇండస్త్రియల్ కారిడార్ తరలించి, అగ్రగామి ఎయిరోస్పేస్, డిఫెన్స్ సంస్ధలు కార్యకలాపాలు నిర్వహిస్తున్న తెలంగాణకు ఢిపెన్స్ కారిడార్ ఎందుకు మంజూరు చేయడంలేదు?
- దేశంలోనే అతిపెద్ద టెక్స్టైల్ పార్కు కలిగి ఉన్న తెలంగాణ రాష్ర్ట టెక్స్ టైల్ రంగానికి చేయూత ఇయ్యకుండా, ఒక్క మెగా పవర్ లూం టెక్స్ టైల్ క్లస్టర్ కూడా ఇవ్వకుండా శీతకన్ను వేసింది నిజం కాదా?
- తెలంగాణ రైతులు తమ దాన్యాన్ని పంజాబ్ మాదిరే కొనుగోలు చేయాలని, డీల్లీ వేధికగా కోరినా ఎందుకు కొనుగోలు చేయడంలేదు?
- మీ ఎంపి బాండ్ పేపర్ పై ప్రజలకు రాసిచ్చిన హమీని తుంగలో తొక్కి ఇప్పటికీ నిజామాబాద్ జిల్లా పసుపు రైతులకు ఇవ్వాల్సిన పసుపు బోర్డు ఎందుకిస్తాలేరో చెప్పగలరా?
- దేశ ప్రజల నడ్డి విరిచేలా పెంచుతున్న పెట్రో ధరల పైన అసలు కారణమైన సెస్సులను రద్దు చేసి ప్రజలకు ఉపశమనం కలిగించాలని మా ముఖ్యమంత్రి కెసియార్ గారు చేసిన డిమాండ్ విషయంలో మీ వైఖరి స్పష్టం చేస్తారా? మీరు దేశ ప్రజానీకంపై మోపిన సెస్సుల భారాన్ని రద్దు చేసి పెట్రో ధరలను తగ్గిస్తారో లేదో తెలంగాణ గడ్డ మీద నుంచి స్పష్టం చేస్తారా?
- వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారి ట్రెడిషనల్ మెడిసిన్ సెంటర్ హైదరాబాద్ లో పెట్టబోతున్నామని మీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రకటించారు. కానీ దాన్ని సైతం గుజరాత్ కు తీసుకెళ్లిన మీది వైఖరి, గుజరాత్ పక్షపాత వైఖరి కాదా?
- హైదరాబాద్ లో ఆర్బిట్రేషన్ సెంటర్ కు ఒక్కపైసా సహాయం చేయకపోగా, పోటీగా గుజరాత్ లో మరో సెంటర్ ను పెట్టిన మాట వాస్తవం కాదా?