Tuesday, November 26, 2024

మరో సర్జికల్ స్ట్రైక్స్ తప్పదు: పాక్ కు అమిత్ షా వార్నింగ్

దేశ సరిహద్దుల్లో పాక్ కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. ఆయుధాల తరలింపు, అక్రమ చొరబాట్లు, డ్రోన్ల ద్వారా దాడులకు ప్రయత్నాలు చేస్తోంది. అయితే, భారత సైన్యం ఎప్పటికప్పుడూ వాటిని తిప్పికొడుతూనే ఉంది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ కు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా గట్టి వార్నింగ్ ఇచ్చారు. అతిక్ర‌మ‌ణ‌కు పాల్ప‌డితే మ‌రిన్ని స‌ర్జిక‌ల్ స్ట్రైక్స్ త‌ప్ప‌వ‌ని హెచ్చరించారు. దాడుల‌ను ఏమాత్రం స‌హించ‌బోమ‌ని స‌ర్జిక‌ల్ స్ట్రైక్స్ నిరూపించాయని గుర్తు చేశారు. అతిక్ర‌మ‌ణ‌కు పాల్ప‌డితే మ‌రిన్ని స్ట్రైక్స్ త‌ప్ప‌వని స్పష్టం చేశారు. ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ, మాజీ ర‌క్ష‌ణ మంత్రి మ‌నోహ‌ర్ పారిక‌ర్ తీసుకున్న ముఖ్య‌మైన నిర్ణ‌యం ఈ స‌ర్జిక‌ల్ స్ట్రైక్‌ అని పేర్కొన్నారు. భారత స‌రిహ‌ద్దుల‌ను ఎవ‌రూ చెరిపే ప్ర‌య‌త్నం చేయ‌కూడ‌ద‌న్న గ‌ట్టి సందేశం దీని ద్వారా వెళ్లిందని చెప్పారు. సరిహద్దుల్లో ఏదైనా జరిగితే ఒక‌ప్పుడు చ‌ర్చలు జ‌రిగేవి.. కానీ, ఇప్పుడు పరిస్థితి మారిపోయిందన్నారు. దెబ్బకు దెబ్బ కొట్టే స‌మ‌యం అని అమిత్ షా హెచ్చరించారు.

ఇది కూడా చదవండి: న్యూడ్ చాటింగ్‌తో ముగ్గులోకి..

Advertisement

తాజా వార్తలు

Advertisement