ఉత్తర్‌ప్రదేశ్‌లో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. ఫిబ్రవరి 10న ఎన్నికలు ఉండటంతో.. పశ్చిమ యూపీలోనే అన్ని పార్టీల నేతలు మకాం వేశారు. ఈ నేపథ్యంలో బీజేపీ, సమాజ్‌వాదీ పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. ముజఫర్ నగర్ అల్లర్ల విషయాన్ని అమిత్ షా ప్రస్తావిస్తే.. దానికి అఖిలేష్ యాదవ్ తాజా పరిస్థితులను ఉదాహరిస్తున్నారు. ఇద్దరి మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు నెలకొన్నాయి. సవాళ్లు.. ప్రతి సవాళ్లతో ఇరువురి మధ్య తీవ్ర పోటీ కొనసాగుతున్నది. బీజేపీపై సమాజ్‌వాదీ, సమాజ్‌వాదీపై బీజేపీ విమర్శలు గుప్పిస్తూనే ఉన్నాయి. సమాజ్‌వాదీ పార్టీ కూటమి నేతలు అఖిలేష్, జయంత్ చౌదరీతో పాటు బీజేపీ నేత అమిత్ షా పశ్చిమ యూపీపై గురి పెట్టారు. జాట్లను ఓట్లు అడిగే సమయంలో అఖిలేష్ యాదవ్‌కు సిగ్గు అనిపించడం లేదా..? అని అమిత్ షా విమర్శించారు. ముజఫర్‌నగర్ అల్లర్లలో జాట్‌లు అఖిలేష్ కారణంగానే సర్వం కోల్పోయారని ఆరోపించారు. అఖిలేష్ హయాంలో దొంగతనాలు, హత్యలు, దోపిడీలు, బెదిరింపులు, వసూళ్లు, అత్యాచారాలు ఎక్కువగా ఉండేవన్నారు. ఇప్పుడు చాలా వరకు తగ్గాయని షా చెప్పుకొచ్చారు…
దీనిపై అఖిలేష్ యాదవ్ సవాల్ విసిరారు. తన హయాంలో.. యోగీ హయాంలోని భద్రతపరమైన అంశాలపై చర్చకు సిద్ధమా..? అంటూ అమిత్ షాను ఉద్దేశిస్తూ.. సవాల్ చేశారు. నిజం చెప్పేందుకు ఎలాంటి సమయం అవసరం లేదని, బీజేపీ చేస్తున్న ప్రతీ ఛాలెంజ్‌ను స్వీకరిస్తున్న అని.. సమయం, వేదిక చెబితే వస్తానని అఖిలేష్ చెప్పుకొచ్చారు. ఈ విషయంలో.. యూపీ సీఎం యోగీ.. మీడియా సలహాదారు మృత్యుంజయ కుమార్ స్పందించారు. నోయిడా రాగలరా..? అంటూ అఖిలేష్‌ను ప్రశ్నించారు. నోయిడా అంటే అఖిలేష్‌కు ఎంతో భయం అని, నోయిడా వస్తే.. తన కుర్చీ పోతుందనే అపనమ్మకం అతనిలో ఉందని చెప్పుకొచ్చారు. నోయిడా ఫోబియా గురించి ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్యూలో అఖిలేష్ సయంగా తెలిపారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..