కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా తెలంగాణలో పర్యటించనున్న విషయం తెలిసిందే. ఈ మేరకు ఆయన తెలంగాణ టూర్ షెడ్యూల్ ఖరారైంది. ఈనెల 15వ తేదీన భద్రాచలంలో రాములవారి దర్శనంతో షా పర్యటన ప్రారంభం కానుంది. దీని కోసం 15న ఉదయం 11గంటలకు ప్రత్యేక విమానంలో శంషాబాద్ విమానాశ్రయానికి కేంద్ర మంత్రి చేరుకోనున్నారు. అనంతరం ఆయన పర్యటన ఇలా కొనసాగనుంది.
శంషాబాద్ విమానాశ్రయం నుంచి జేడీ కన్వెన్షన్ కు షా రానున్నారు. 11:15 నుంచి 12:45 వరకు అల్పాహారం, మధ్యాహ్నం 1:10 గంటలకు శంషాబాద్ విమానాశ్రయం నుంచి భద్రాచలానికి పయనం, 2:20 నుంచి 3:20 గంటల వరకు రాముల వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు, సాయంత్రం 4:50 నుంచి 5:50 గంటల వరకు ఖమ్మం బహిరంగ సభలో పాల్గొననున్నారు.
సభ ముగించుకుని సాయంత్రం 6 గంటలకు శంషాబాద్‌కు అమిత్ షా బయల్దేరనున్నారు. రాత్రి 7 గంటలకు శంషాబాద్ నోవాటెల్‌కు చేరుకోనున్నారు. పలువురు నేతలతో అమిత్ షా గంటపాటు విడివిడిగా సమావేశమవనున్నారు. రాత్రి 9:30 గంటలకు శంషాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి అమిత్ షా తిరుగు ప్రయాణం కానున్నారు.