బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, జాతీయ నాయకులు ఫోన్ చేశారు. బండి…గో ఎహెడ్,
కేంద్రం, జాతీయ నాయకత్వమంతా మీకు అండగా ఉందంటూ కరీంనగర్ లో ఉన్న బండి సంజయ్ కి కేంద్ర మంత్రులు, జాతీయ నాయకులు ఫోన్ చేశారు. బీఆర్ఎస్ కుట్రలను చేధిద్దాం – ప్రజా సమస్యలపై ఉధ్రుతంగా పోరాడండి ఆని సూచించారు. జైలు నుండి విడుదలైన బండి సంజయ్ కు అమిత్ షా, నడ్డా, స్మృతి ఇరానీ ఫోన్ చేసి మాట్లాడారు. వీరితోపాటు సంజయ్ కు తరుణ్ చుగ్, సునీల్ బన్సల్ సహా జాతీయ నాయకులు ఫోన్ చేసి మాట్లాడారు.
బండి సంజయ్ కు వీరతిలకం దిద్ది..
ఈ ఉదయం జైలు నుండి విడుదలై ఇంటికి వెళుతున్న బండి సంజయ్ కు మార్గమధ్యలో విజయ తిలకం దిద్ది, స్వీట్ తినిపించారు విద్యార్థినీలు, మహిళలు. ఈ సందర్బంగా బండి సంజయ్ విద్యార్థులతో సెల్ఫీ దిగారు.