పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో ఉగ్ర కార్యకలాపాలు పెరుగుతున్నాయనీ..దేశానికి ముప్పు పొంచి వుందనే రిపోర్డుల నేపథ్యంలో కేంద్ర మంత్రి అమిత్ షా జమ్మూ కాశ్మీర్ లో పర్యటించారు. ఈ సందర్భంగా జమ్మూకాశ్మీర్ భద్రతను సమీక్షించారు. తీవ్రవాద నిరోధక చర్యలపై దృష్టి సారించిన ఆయన అక్కడి ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. శ్రీనగర్‌లోని అధికారుల ప్రకారం పాక్ ఆక్రమిత కాశ్మీర్లో తీవ్రవాద కార్యకలాపాలు పెరగడం, చొరబాటుదారుల సమస్యలు వంటివి అధికం అవుతున్నాయి. పీర్ పంజాల్ కు ఇరువైపుల వున్న ఉగ్రమూఖలను అరికట్టే చర్యలను ముందుకు తీసుకెళ్లడంపై దృష్టి సారించారు. జమ్మూ కాశ్మీర్‌లోని భద్రతా బలగాలు ఉగ్రవాద నిరోధక కార్యకలాపాలను సమన్వయం చేశాయి. పాక్ ఆధారిత గ్రూపులకు చెందిన ఉగ్రవాదులను .. లోయలోని వారి ప్రాక్సీలను చురుకుగా మట్టుబెట్టగలిగాయి.రెడీమేడ్ IEDలను అక్రమంగా రవాణా చేస్తున్నట్లు నిఘా నివేదికలు పేర్కొనడంతో ఈ చర్యలను ముమ్మరం చేశాయి భద్రతా బలగాలు. ఇప్పటికే అనేక RDX-ఆధారిత IEDలు సరిహద్దు దాటి పంపబడినట్లు అందిన నివేదికలతో యంత్రాంగం అప్రమత్తమైంది.
జమ్మూ కాశ్మీర్ పోలీసులు, పారా మిలటరీ బలగాలు .. భారత సైన్యం మద్దతుతో గత మూడు నెలల్లో పెద్ద సంఖ్యలో ఉగ్రవాదులను మట్టుబెట్టగలిగినప్పటికీ, బహవల్పూర్ కేంద్రంగా ఉన్న జైష్-ఎ-మహ్మద్ ఉగ్రమూకలు..చురుకుగా ఉన్నారు. అలాగే, లష్కరే తోయిబా కూటా లోయలో కల్లోలం సృష్టించే అవకాశముందని అధికారులు పేర్కొంటూ.. వారికి అడ్డుకట్ట వేసే చర్యలు కొనసాగుతున్నాయన్నారు. ఆగస్టు 15, 2021న కాబూల్‌ను తాలిబాన్ ఆక్రమించిన తర్వాత ఆఫ్ఘనిస్తాన్‌లో అమెరికా నేతృత్వంలోని సంకీర్ణం బలగాలు.. అసాల్ట్ రైఫిల్స్, నైట్ విజన్ పరికరాలు, స్నిపర్ రైఫిల్స్, C-4 పేలుడు పదార్థాలతో సహా అధునాతన ఆయుధాల పర్వతాన్ని వదిలిపెట్టడంతో, భద్రతా ఏజెన్సీలలో ఆందోళన నెలకొంది. అమెరికా తయారు చేసిన ఆయుధాలు లోయలో ఉపయోగించేందుకు పాకిస్థానీ పంజాబీ టెర్రర్ గ్రూపుల చేతుల్లోకి వెళ్తాయి. ఇప్పటికే, అగ్రశ్రేణి తాలిబాన్ నాయకత్వంతో సైద్ధాంతిక, కుటుంబ సంబంధాలను కలిగి ఉన్న ఉగ్ర సంస్థలు దారుణాలకు ఒడిగట్టే అవకాశం ముంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..