రక్షణ రంగంలో దేశాన్ని స్వావలంబనగా మార్చడానికి కావాల్సిన అన్ని ప్రయత్నాలు చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. దేశ భద్రత విషయంలో ఇవ్వాల జరిగిన హైలెవల్ భేటీలో ప్రధాని పలు అంశాలను ప్రస్తావించారు. ఉక్రెయిన్-రష్యా యుద్ధం నేపథ్యంలో ఈ సమావేశం జరిగింది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, భారత విదేశాంగ కార్యదర్శి హర్షవర్ధన్ శ్రింగ్లా తదితరులు కీలక సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశంలో సరిహద్దు ప్రాంతాలతో పాటు సముద్ర, గగనతలంలో భారతదేశం యొక్క భద్రతా సంసిద్ధత యొక్క తాజా పరిణామాలు.. విభిన్న అంశాలను ప్రధాని మోదీకి వివరించారు.
ఉక్రెయిన్ నుండి భారతదేశం యొక్క పొరుగు దేశాలలోని కొంతమంది పౌరులతో పాటు భారతీయ పౌరులను తరలించడానికి ఆపరేషన్ గంగా యొక్క వివరాలతో సహా ఉక్రెయిన్‌లో తాజా పరిణామాలపై కూడా ఆయనకు వివరించినట్టు అధికారులు తెలిపారు. కాగా, రక్షణ రంగంలో గ్లోబల్ టెక్ వినియోగం, దానిలో దేశం యొక్క పురోగతిని కూడా ప్రధాని మోదీ సవివరంగా సమీక్షించారు. సమావేశంలో ప్రధాని మోదీ దేశ భద్రతా యంత్రాంగంలో సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని సమగ్రపరచడాన్ని నొక్కి చెప్పారు. రక్షణ రంగంలో భారత్‌ను స్వావలంబనగా మార్చేందుకు ప్రతి ప్రయత్నం తప్పనిసరని ప్రధాన మంత్రి పునరుద్ఘాటించారు, తద్వారా అది మన భద్రతను బలోపేతం చేయడమే కాకుండా ఆర్థిక వృద్ధిని కూడా పెంచుతుందన్నారు.
చనిపోయిన వారి మృతదేహాలను తీసుకురావడం..
ఉక్రెయిన్‌లోని ఖార్కివ్‌లో యుద్ధంలో మరణించిన భారతీయ విద్యార్థి నవీన్ శేఖరప్ప మృతదేహాన్ని తిరిగి తీసుకురావడానికి అన్ని ప్రయత్నాలు చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ అధికారులను ఆదేశించారు. ఫిబ్రవరి 24న ఉక్రెయిన్‌పై రష్యా సైనిక దాడి ప్రారంభించింది. ఉక్రెయిన్‌పై రష్యా పూర్తి స్థాయి దండయాత్రను ప్రకటించినప్పటి నుండి ప్రధాని మోదీ కేంద్ర మంత్రులు, సీనియర్ అధికారులతో అనేక ఉన్నత స్థాయి సమావేశాలు నిర్వహించారు.