భారత సంతతికి చెందిన ప్రఖ్యాత గణిత శాస్త్రవేత్త నిఖిల్ శ్రీవాస్తవకు అరుదైన అవార్డు దక్కింది. 1959 నాటి గణితశాస్త్ర సమస్యకు పరిష్కారాన్ని కనుగొన్న నేపథ్యంలో శ్రీవాస్తవకు సిప్రియాన్ ఫోయాస్ ప్రైజ్‌కు ఎంపికయ్యారు. ఆపరేటర్ థియేరీలో అమెరికన్ మాథ్యమటికల్ సొసైటీ ఈ అవార్డును అందజేయనుంది. ప్రస్తుతం కాలిఫోర్నియా యూనివర్సిటీలో నిఖిల్ శ్రీవాస్తవ బోధన వృత్తిలో ఉన్నారు.
సిప్రియాన్ అవార్డును గెలిచినవారిలో నిఖిల్‌తో పాటు ఆడమ్ మార్కస్, డానియల్ స్పిల్‌మ్యాన్ ఉన్నారు. ముగ్గురికి కలిసి ఈ అవార్డును సంయుక్తంగా ప్రకటించారు. వచ్చే ఏడాది జనవరి 5వ తేదీన జరిగే కార్యక్రమంలో ఈ అవార్డును అందజేయనున్నట్టు అమెరికన్ మ్యాథమటికల్ సొసైటీ తెలిపింది. గణితశాస్త్రంలో నిఖిల్ శ్రీవాస్తవ ప్రైజ్‌లు గెలవడం చాలా కామన్. ఆ రంగంలో ఆయనకు ఇది మూడో అతిపెద్ద అవార్డు. గతంలో 2014లో జార్జ్ పోలియా ప్రైజ్, 2021లో హెల్డ్ ప్రైజ్‌లను కూడా నిఖిల్ గెలుచుకున్నారు. ఆపరేటర్ థియరీలో రిచర్డ్ కడిసన్, ఇసడోర్ సింగర్ 1959లో విసిరిన ప్రశ్నకు నిఖిల్ పరిష్కారాన్ని కనుగొన్నాడు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital