ప్లైట్ గాల్లో ఉండగా ఇంజిన్ లో మంటలు చెలరేగాయి..దాంతో అప్రమత్తమయిన సిబ్బంది విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశారు. అమెరికన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన 737 బోయింగ్ విమానం ఒహాయె లోని కొలంబస్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ నుంచి ఫీనిక్స్‌కు బయలుదేరింది. విమానం టేకాఫ్ అయిన 25 నిమిషాలకే ఓ పక్షుల గుంపు దాన్ని ఢీ కొట్టింది. దీంతో విమానం కుడి వైపునున్న ఇంజిన్ నుంచి పొగలు వచ్చి.. అనంతరం మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన పైలట్ విమానాన్ని కొలంబస్ విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్ చేసినట్లు ఎయిర్‌పోర్ట్ అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. విమానం కొలంబస్ ఎయిర్‌పోర్టులో సురక్షితంగా ల్యాండ్ అయిన తర్వాత అందులోని ప్రయాణికులను మరో విమానంలో అక్కడి నుంచి తరలించారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement