ఓ వింత ఆకారం అమెరికన్లను భయభ్రాంతులకు గురి చేసింది. అలస్కాలోని ఓ పర్వతంపై వింత ఆకారం కనిపించింది. కాగా
ఓ కొండపై కనిపించిన ఈ ఆకారం ఫొటో సోషల్‌మీడియాలో చక్కర్లు కొట్టింది. అది ఏలియన్స్ వాహనం అని కొందరు..ఉల్కాపాతం అని మరికొందరు ఊహించారు. మరికొందరు ఓ ముందడుగేసి రష్యా ప్రయోగించిన ఆయుధమని పేర్కొన్నారు. దాంతో ఈ ఫొటో అమెరికాలో కలకలం రేపింది.అమెరికాలోని అలస్కాలోగల ఓ పర్వతంపై ఈ వింత ఆకారం కనిపించింది. అది కనిపించగానే స్థానికులు ఫొటో తీసి, సోషల్‌మీడియాలో పెట్టారు. ఈ ఫొటో ప్రజల్లో భయాన్ని పెంచడంతో, అమెరికా అధికారులు రంగంలోకి దిగారు. ఓ హెలికాప్టర్ లో అలస్కా స్టేట్ ట్రూపర్స్ ఆ కొండచుట్టూ చక్కర్లు కొట్టారు. ఆ ప్రాంతంలో ఏమీ కనిపించలేదని, ఆ వింత ఆకారం మేఘమని తేల్చారు. అప్పుడప్పుడూ ప్రకృతిలో జరిగే పలు చర్యలవల్ల మేఘాలు వింతగా కనిపిస్తాయని చెప్పారు. ఎవరూ ఆందోళ చెందాల్సిన పనిలేదని అలస్కా స్టేట్ రెస్క్యూ కోఆర్డినేషన్ సెంటర్ ఓ ప్రకటన కూడా విడుదల చేసింది.
అమెరికన్లని భయపెట్టిన వింత ఆకారం – ఆందోళన వద్దన్న అధికారులు
Advertisement
తాజా వార్తలు
Advertisement