అమెరికాలో గన్ సంస్కృతి విపరీతంగా పెరుగుతోంది. దాంతో తరచుగా అక్కడ కాల్పులు చోటు చేసుకుంటున్నాయి. కాగా మిస్సిస్సిప్పిలో జరిగిన న్యూ ఇయర్ పార్టీలో కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు మరణించారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని హాస్పటల్ కి తరలించారు. కాగా ఈ ఘటనలో గాయపడిన నలుగురిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు వివరించారు. ఈ కాల్పులకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. కాల్పులు జరిగిన సమయంలో మందు పార్టీలో ఎంత మంది ఉన్నారనే విషయమై ఖచ్చితమైన సమాచారం లేదని పోలీస్ ఉన్నతాధికారి రైల్ వెల్లడించారు. మిస్సిస్సిప్పిలో గల్ఫ్ ఫోర్ట్ న్యూ ఇయర్ పార్టీలో ఈ ఫైరింగ్ చోటు చేసుకుంది. ఈ కాల్పుల్లో తుపాకుల నుండి 50బుల్లెట్స్ బయటికి వచ్చాయని అక్కడ చూసిన వారు వెల్లడించారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..