లక్క్ ఉండాలే గాని రాత్రికి రాత్రే లక్షధికారిగానో, కోటీశ్వరుడిగానో అయిపోవచ్చు. ఇందంతా అదృష్టంపైనే ఆధారపడి ఉంటుంది. అక్షరాలా అదే జరిగింది ఓ అంబులెన్స్ డ్రైవర్ కి. ఈ సంఘటన వెస్ట్ బెంగాల్, ఈస్ట్ బార్ధామాన్ లో చోటు చేసుకుంది. ఈ జిల్లాకు చెందిన షేక్ హీరాకు లాటరీ టికెట్లు కొనడం అంటే పిచ్చి. రోజూ ఒక లాటరీ టికెట్ కొంటూ ఉండేవాడు. ఒకరోజు రూ.270 పెట్టి లాటరీ టికెట్ కొన్నాడు. ఉదయం టికెట్ కొన్నాడు.. మధ్యాహ్నానికి కోటీశ్వరుడు అయ్యాడు. అతడి లాటరీ టికెట్‌కు కోటి రూపాయలు గెలుచుకున్నాడు.షేక్ తల్లికి ఆరోగ్యం బాగాలేదు.ఆమె ట్రీట్‌మెంట్ కోసం చాలా డబ్బులు కావాలి. ఆమె ట్రీట్‌మెంట్ కోసం ఎలాగైనా డబ్బులు సేకరించాలని..
షేక్ అక్కడా ఇక్కడా తిరుగుతున్న నేపథ్యంలోనే అతడు లాటరీ టికెట్ గెలవడంతో ఆనందానికి హద్దులు లేవనే చెప్పాలి.ఇంత డబ్బుతో ఏం చేస్తావు.. అని అడిగితే.. తన తల్లికి ట్రీట్‌మెంట్ చేయించి.. మిగిలిన డబ్బుతో ఉండటానికి సొంత ఇల్లు కట్టుకుంటానని తెలిపాడు. మొత్తానికి అంబులెన్స్ డ్రైవర్ కాస్త కోటీశ్వరుడు కావడంతో అక్కడి స్థానికులు అతడిని ఆశ్చర్యంగా చూడటం మొదలు పెట్టారు. లాటరీ టికెట్ పై కోటి రూపాయలు గెలిచిన వెంటనే ఏం చేయాలో అతడికి అర్థం కాలేదు. వెంటనే పోలీస్ స్టేషన్‌కు వెళ్లి.. తనకు సెక్యూరిటీ కావాలని పోలీసులకు చెప్పాడు. పోలీసులు అతడిని సురక్షితంగా ఇంటికి తీసుకెళ్లి.. తన ఇంటి వద్ద పోలీసులను కాపలా పెట్టారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..