హైదరాబాద్, ఆంధ్రప్రభ : అట్టహాసంగా అంబేద్కర్ విగ్రహంతోపాటు, శాస్త్రోక్తంగా సచివాలయ ప్రారంభా నికి ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ రెండు అత్యుత్తమ సంబురాలను అత్యంత వైభవోపేతంగా నిర్వహించేం దుకు సకల ఏర్పాట్లు చేసుకుంటోంది. ఏప్రిల్ 14న 125 అడుగుల ఎత్తౖన అంబేద్కర్ విగ్రహావిష్కరణ, 30న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయం ప్రజలకు, దేశంలోని సందర్శకులకు, ప్రభుత్వ పాలనకు అందుబాటులోకి రానున్నాయి. ”దేశం గర్వించదగ్గ రీతిలో అందరివాడు డా.బిఆర్ అంబేద్కర్ మహాశ యుని మహా విగ్రహాన్ని మనం ఆవిష్కరించుకోబోతున్నం. ఈ దేశం ప్రజలకోసం భవిష్యత్తు తరాలకోసం రాజ్యంగ నిర్మాతగా సామాజిక న్యాయం కోసం పోరాడిన యోధునిగా ఆయన చేసి న కృషి, త్యాగం అజరామరం. కేవలం దళితులు, గిరిజనులు బహుజనులు, భార తదేశ ప్రజలు మాత్రమే కాదు…వివక్షను ఎదుర్కునే ప్రతీ చోటా అంబేద్కర్ ఆశ యం సాక్షాత్కారమవుతుంది” అని సీఎం కేసీఆర్ కొనియాడారు. భారత రాజ్యాం గ నిర్మాత, భారత రత్న, డా. బిఆర్ అంబేద్కర్ మహాశయుడు కనబరిచిన దార్శని కతతోనే దళిత గిరిజన బహుజన వర్గాలతో పాటు సకల జనులందరికీ ఆర్థిక, సామాజిక న్యాయం, అన్ని రంగాల్లో సమాన న్యాయం అమల్లోకి వచ్చిందని, ఇందుకోసం తన జీవితాన్నే త్యాగం చేసిన ప్రపంచం గర్వించదగ్గ మేధావి డా. బిఆర్ అంబేద్కర్ అని ఆయన పునరుద్గాటించారు. తన దూరదృష్టితో అనేక చర్చ ల అనంతరం, ప్రత్యేక రాష్ట్రాల కోసం, ఆర్టికల్ 3 ని రాజ్యాంగంలో ప్రత్యేక శ్రద్ధతో రూపొందించి పొందుపరిచారని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రం సాకారం కావడానికి మార్గం సుగమం చేసిన తెలంగాణ బాంధవుడు, అందరివాడు, డా. బిఆర్ అంబేద్కర్.. అని స్పష్టం చేశారు.
పక్కనే సచివాలయం, ఎదురుగా తన ఆరాధ్యుడు బుద్ధుని విగ్ర#హం, మరోదిక్కు త్యాగాలు చేసిన అమర వీరుల స్మారక స్థూపం..వీటి నడుమ శిఖరమంత ఎత్తున నిలిచిన అంబేద్కర్ మహానుభావు డు మనలను నిత్యం చైతన్యపరుస్తూ పాలక వ్యవస్థకు నిత్య స్పూర్తివంతమై దారి చూపుతాడని సీఎం కేసీఆర్ అభి ప్రాయపడ్డారు. 125 అడుగుల ఎత్తులో నిర్మించిన డా. బిఆర్ అంబేద్కర్ మహా విగ్రహాన్ని, శోభాయమానంగా.. తెలంగా ణ సమాజంతో పాటు యావత్ దేశ ప్రజలు సంబురపడేలా గొప్పగా ఆవిష్క రించుకుందామని సీఎం కేసీఆర్ అన్నా రు. దేశం గర్వించదగ్గ స్థాయిలో విగ్ర హాన్ని ఏర్పాటు చేసుకుంటున్న సంద ర్భంలో ఆవిష్కరణ సభ కూడా అంతే ఉన్నత స్థాయిలో, అంబేద్కర్ ఔన్నత్యాన్ని మరింత గొప్పగా ప్రపంచానికి చాటి చెప్పేలా ఉండాలని మంత్రులకు, అధికారులకు స్పష్టం చేశారు.
తక్షణమే గృహలక్ష్మికి విధివిధానాలు…
రాష్ట్ర ప్రభుత్వం అద్బుతంగా ఇండ్లులేని పేదలకు ఆర్ధిక సాయం కోసం తీసుకొచ్చిన గృహలక్ష్మి పథకానికి సత్వరమే విధివిధానాలను రూపొందించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఈ పథకం ద్వారా సొంతింటికి రూ. 3లక్షల ఆర్ధిక సాయం అందించాలని సీఎం కేసీఆర్ సూచించారు. అదేవిధంగా సుదీర్గకాలంగా పెండింగ్‌లో ఉన్న పోడు భూముల పట్టాల పంపిణీ త్వరలో చేపట్టాలని నిర్ణయించారు. గొల్ల కురుముల అభ్యున్నతికి ప్రభుత్వం అమలు చేస్తున్న గొర్రెల పంపిణీని తక్షణమే ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. దళితోద్దవరణకు, వారి జీవితాల్లో వెలుగులు నింపే అభ్యుదయ పథకం దళితబంధును కొనసాగించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఏప్రిల్ 14 న అంబేద్కర్ పుట్టిన రోజు సందర్భంగా జరపతలపెట్టిన విగ్రహావిష్కరణ కార్యక్రమం.. అనంతరం నిర్వ#హంచే బ#హరంగ సభకు సంబంధించిన ఏర్పాట్లు తదితర అంశాలపై మంగళవారం ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్ ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వ#హంచారు. అంబేద్కర్ విగ్ర#హం స్థాపించాలని నిర్ణయం తీసుకున్న నాటినుంచి, కలకాలం నిలిచే విధంగా సాంకేతికంగా, తయారీ పరంగా పకడ్బందీ చర్యలు తీసుకోవడాని కనీసం రెండు సంవత్సరాల సమయం తీసుకున్నదని గుర్తు చేసుకున్నారు. ఇందుకు పలు దేశాలు ప్రాంతాలు తిరిగి సమాచారాన్ని సేకరించి పూర్తి స్వదేశీ పరిజ్జానంతోనే రూపొందించడం తనకు అత్యంత సంతృప్తిని కలిగించిందని తెలిపారు. ”నీను ఊహంచినదానికంటే అత్యద్భుతంగా విగ్రహం రూపం ఆవిష్కృతమైంది. ప్రసన్నవదనంతో నిలుచుని వున్న అంబేద్కరుడు ఒక తాత్విక జ్జానిగా అలరిస్తున్నాడు..” అని సీఎం కేసీఆర్ తన ఆనందాన్ని, సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విగ్రహ రూపశిల్పి.. 98 ఏండ్ల పద్మభూషణ్, రామ్ వంజీ సుతార్..కృషిని ప్రశంసించారు. వారిని ప్రత్యేకంగా ఆహ్వానించి ఘనంగా సత్కరించాలని నిర్ణయించారు.
”అంబేద్కర్ మహాశయుడు విశ్వ మానవుడు. ఆయన చేసిన కృషి ఒక్కటని చెప్పలేము. ఆయనకు మనం ఎంత చేసుకున్నా తక్కువే. అత్యున్నత స్థాయిలో విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం అంటే ఆయన అత్యున్నత ఆశయాలను అనుస రించేందుకు నిత్యం స్పూర్తి పొందడమే..” అని సీఎం కేసీఆర్ స్మరించుకున్నారు. అంబేద్కర్ ఆశయాల సాధన కోసం ప్రజా ప్రతినిధులు, యావత్ ప్రభుత్వ యంత్రాంగం కృషి చేయాలనే గొప్ప సంకల్పంతోనే.. రాష్ట్ర సచివాలయానికి ఆయన పేరు పెట్టుకున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహస్తున్న కార్యక్రమాన్ని తగు జాగ్రత్తలతో పకడ్బందీగా నిర్వహంచాలని ఆదేశించారు. రాష్ట్రం నలు మూలలనుంచి విగ్రహావిష్కరణ కోసం వచ్చే అతిథులు, ప్రజల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేసుకోవాలి’ అని మంత్రులకు, ఉన్నతాధికారులకు సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు.
విగ్రహావిష్కరణ జరిగిన తర్వాత, రాష్ట్రం నలుమూలలనుంచే కాకుండా దేశవ్యాప్తంగా అంబేద్కర్ అభిమానులు సామాజిక వేత్తలు సామాన్యులు విగ్రహ సందర్శనకోసం వస్తారని, ఈ సందర్భంగా నివాళులర్పించేందుకు విగ్రహ ప్రాంగ ణంలో పలు రకాల పుష్పాలను అందుబాటులో ఉంచాలని తెలిపారు. నీడకోసం టెంట్లు ఏర్పాటు చేయాలని, తాగునీరు, మజ్జిగ తదితర ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ ఏర్పాట్లన్నీ మరో నెల రోజుల పాటు కొనసాగించాలని మంత్రులను, అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. తాను 4 దశాబ్దాల క్రితమే ఎమ్మెల్యేగా వున్నప్పుడు భారత దేశ దళితుల స్థితి గతులను ప్రపంచంలోని అణగారిన వర్గాలతో పాటు పోల్చుతూ అధ్యయనం చేయాలనే తలంపుతో ‘సెంటర్ ఫర్ సబాల్టర్న్ స్టడీస్ ‘ అనే అధ్యయన కేంద్రాన్ని ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా భారత దేశంలో అంటరాని తనం పేరుతో దుర్మార్గమైన రీతిలో వివక్షకు గురవుతున్న దళితుల అభ్యున్నతికోసం, వారితో పాటు అన్ని వర్గాల ప్రజల హక్కుల కోసం డా. బిఆర్ అంబేద్కర్ పడిన శ్రమ, కృషి ఆసియా ఖంఢంలోనే మరొకరు చేయలేదని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.