Friday, November 22, 2024

Breaking: కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు ఖరారు.. కేబినెట్ ఆమోదం

కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు ఖరారుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ఏపీ కేబినెట్ సమావేశం పలు నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. వైద్యారోగ్య శాఖలో పోస్టుల భర్తీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈనెల 27న అమ్మ ఒడి పథకం నిధుల విడుదల, మరో నాలుగు సంక్షేమ పథకాలకు ఏపీ కేబినెట్ ఆమోద ముద్ర వేసింది.

అయితే కోనసీమకు అంబేద్కర్ పేరు పెట్టవద్దంటూ అమలాపురంలో పెద్ద ఎత్తున నిరసనలు, ఆందోళన కార్యక్రమాలు చేపట్టిన విషయం విధితమే.

Advertisement

తాజా వార్తలు

Advertisement