డా.బీఆర్ అంబేద్కర్ విశ్వ మానవుడని సీఎం కేసీఆర్ అన్నారు. అంబేద్కర్ విగ్రహావిష్కరణ అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో కేసీఆర్ మాట్లాడుతూ… ఇది విగ్రహం కాదు.. ఒక విప్లవమన్నారు. ఆయన సిద్ధాంతం సార్వజనీనమైందన్నారు. ప్రపంచవ్యాప్తంగా అణగారిన వర్గాలకు ఆశాదీపం అంబేద్కర్ అన్నారు. అంబేద్కర్ ఆశయ సాధన దిశగా వెళ్లాలన్నారు. అంబేద్కర్ విగ్రహాన్ని ఎవరో డిమాండ్ చేస్తే ఏర్పాటు చేయలేదన్నారు. సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టుకున్నామన్నారు. ఈ భారీ మూర్తి రూపంలో ఒక బలమైన మెసేజ్ ఉందన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement