అమెజాన్ ఇండియా హెడ్ అమిత్ అగర్వాల్ కు నోటీసులు అందాయి. ఫ్యూచర్ గ్రూప్ ..అమెజాన్ మధ్య ఒప్పందం జరిగింది. అయితే అమెజాన్ అవకతవకలకి పాల్పడినట్టు ఈడీ భావిస్తోంది. ఈ మేరకు నోటీసులు పంపింది. ఈడీ నుంచి నోటీసులు అందినట్లు అమెజాన్ ఇండియా ప్రతినిధి తెలిపారు..నోటీసులను పరిశీలించి తాము వివరణ ఇస్తామన్నారు. ఫ్యూచర్ గ్రూప్ తో ఒప్పందంలో ఫెమా (విదేశీ మారకద్రవ్య నిర్వహణ చట్టం) నిబంధనలు ఉల్లంఘించినట్టు అమెజాన్ ఇండియా విభాగంపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. దీనిపై విచారణ జరుపుతున్న ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తాజాగా అమెజాన్ ఇండియా హెడ్ అమిత్ అగర్వాల్ కు నోటీసులు జారీ చేసింది. వచ్చే వారం తమ ముందు హాజరు కావాల్సి ఉంటుందని ఆ నోటీసుల్లో స్పష్టం చేసింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement