వైద్యరంగం ఎంతో అభివృద్ధి చెందుతోంది. గుండె మార్పిడి సహ అన్నింటా దూసుకెళ్తోంది. కాగా తెగిపోయిన చేతిని తిరిగి అతికించి అద్భుతాన్ని చేశారు డాక్టర్లు. ఈ సంఘటన బెంగళూరులో జరిగింది.నగరానికి చెందిన ఓ వ్యక్తి (55) ఓ కంపెనీలో మేనేజర్‌గా పనిచేస్తున్నారు. కంపెనీకి ఇటీవల కొత్తగా వచ్చిన ఓ యంత్రాన్ని పరిశీలిస్తుండగా ప్రమాదవశాత్తు చెయ్యి అందులో పడి మణికట్టు వరకు తెగిపోయింది. వెంటనే అప్రమత్తమైన ఫ్యాక్టరీ సిబ్బంది తెగిపడిన చేయితో పాటు బాధితుడిని వెంటనే నగరంలోని బన్నేరుఘట్‌లో ఉన్న ఫోర్టిస్ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ఏడు గంటలపాటు ఆపరేషన్ చేసి తెగిపడిన చేతిని విజయవంతంగా అతికించినట్టు ఆసుపత్రి సర్జన్ సత్యవంశీకృష్ణ తెలిపారు. ఇది నిజంగా అద్భుతమని డాక్టర్లని కొనియాడుతున్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement