రికార్డ్ క్రియేట్ చేసింది ఈ ఏడాది అమర్ నాథ్ యాత్ర. ఈ ఏడాది మొదటి 22 రోజులకే ఈ రికార్డ్ నమోదైంది. 2,94,040 మంది హిమ శివలింగాన్ని దర్శించుకున్నారు. గతేడాది 60 రోజుల యాత్ర పొడవునా దర్శించుకున్న వారి సంఖ్య 2.85 లక్షల కంటే ఇది ఎక్కువ. ఈ ఏడాది మొత్తం మీద దర్శించుకునేవారి సంఖ్య, ఇటీవలి సంవత్సరాల కంటే ఎక్కువగా ఉంటుందని అమర్ నాథ్ ష్రైన్ బోర్డ్ ప్రకటించింది. ఈ యాత్ర ఆగస్ట్ 15తో ముగియనుంది. 2015లో 3,52,771 మంది, 2016లో 3,20,490 మంది అమర్ నాథ్ గుహను దర్శించుకున్నారు. 2017లో అమర్ నాథ్ గుహను సందర్శించిన వారి సంఖ్య 2,60,003గా ఉంది. ఈ ఏడాది యాత్ర ముగిసే నాటికి సందర్శించుకునే భక్తుల సంఖ్య భారీగా ఉండనుందని తెలుస్తోంది. 4,700 మందితో కూడిన తాజా బృందం భగవతి నగర్ బేస్ క్యాంప్ నుంచి అమర్ నాథ్ గుహ దిశగా ప్రయాణమై వెళ్లింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement