ఎయిర్ మార్షల్ సందీప్ సింగ్ పదవీ విరమణ చేశారు. దాంతో ఎయిర్ ఫోర్స్ కొత్త వైస్ చీఫ్‌గా ఎయిర్ మార్షల్ అమన్‌ప్రీత్ సింగ్ బాధ్యతలు స్వీకరించారు. ఎయిర్ మార్షల్అమన్‌ప్రీత్ సింగ్ ప్రస్తుతం ప్రయాగ్‌రాజ్ కేంద్రంగా ఉన్న సెంట్రల్ ఎయిర్ కమాండ్ .. ఎయిర్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్‌గా పనిచేస్తున్నారు. ఎయిర్ మార్షల్ అమన్‌ప్రీత్ సింగ్ డిసెంబర్ 21, 1984న భారత వైమానిక దళం ఫైటర్ స్ట్రీమ్‌లోకి ప్రవేశించారు. ఎయిర్ మార్షల్ సింగ్ నేషనల్ డిఫెన్స్ అకాడమీ, డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజ్ , నేషనల్ డిఫెన్స్ కాలేజీ పూర్వ విద్యార్థి. ఆయన వివిధ రకాల ఫిక్స్‌డ్ వింగ్, రోటరీ వింగ్ ఎయిర్‌క్రాఫ్ట్‌లలో 4,900 గంటలకు పైగా ప్రయాణించిన అనుభవం ఆయన సొంతం. ఎయిర్ మార్షల్ ఏపీ సింగ్ రష్యాలోని మాస్కోలో ‘మిగ్ 29 అప్‌గ్రేడ్ ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ టీమ్’కి కూడా నాయకత్వం వహించారు. ఆయన నేషనల్ ఫ్లైట్ టెస్ట్ సెంటర్‌లో ప్రాజెక్ట్ డైరెక్టర్ (ఫ్లైట్ టెస్ట్)గా కూడా సేవలందించారు. ఆయన ఈ సమయంలో తేలికపాటి యుద్ధ విమానం తేజస్ యొక్క ఫ్లైట్ టెస్టింగ్‌ను పర్యవేక్షించాడు. సౌత్ వెస్ట్రన్ ఎయిర్ కమాండ్‌లో ఎయిర్ డిఫెన్స్ కమాండర్‌గా కూడా పనిచేశారు. AP సింగ్ సెంట్రల్ ఎయిర్ కమాండ్ యొక్క ఎయిర్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించడానికి ముందు తూర్పు ఎయిర్ కమాండ్‌లో సీనియర్ ఎయిర్ స్టాఫ్ ఆఫీసర్‌గా వ్యవహరించారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement