Friday, November 22, 2024

Movie: వాళ్లని చూసి స్ఫూర్తి పొందేవాడిని.. హీరో నితిన్‌ ఇంకా ఏం చెబుతున్నారంటే!

నితిన్‌ నటిస్తున్న చిత్రం ‘మాచర్ల నియోజకవర్గం’ శ్రేష్ట్‌ మూవీస్‌ పతాకంపై సుధాకర్‌ రెడ్డి, నికితారెడ్డి నిర్మిస్తున్నారు. ఎమ్‌.ఎస్‌.రాజ శేఖర్‌రెడ్డి దర్శకుడు. కృతి శెట్టి, కేథరిన్‌ థ్రెసా కథానాయికలు. ఆగస్టు 12న ఈ చిత్రం విడుదలవుతున్న నేపధ్యంలో హీరో నితిన్‌ విలేఖరుల సమావేశంలో సినిమా విశేషాలు వివరించారు. ఆయన పంచుకున్న మాచర్ల నియోజకవర్గం చిత్ర విశేషాలివి.

కొంత విరామం తర్వాత పూర్తిస్థాయి మాస్‌ సినిమా చేస్తున్నారు ?
ప్రత్యేకమైన కారణం అంటూ ఏమీ లేదు. ఇరవై ఏళ్ళుగా పరిశ్రమలో వున్నా. ప్రేమ కథలు చేసి కొంత బోర్‌ ఫీలింగ్‌ వచ్చింది. కొత్తగా ప్రయత్నించి నెక్స్ట్‌ లెవల్‌ కి వెళ్ళాలనే అలోచనతో మాచర్ల నియోజకవర్గం చేశా. ఇది ఫుల్‌ లెంత్‌ కమర్షియల్‌ మూవీ. పవర్‌ ఫుల్‌ రోల్‌.

మిమ్మల్ని బాగా ఆకట్టు-కున్న పాయింట్‌ ఏమిటి ?
హీరో క్యారెక్టరైజేషన్‌ చాలా నచ్చింది. నేను ఐఎఎస్‌ పాత్ర ఇప్పటి వరకు చేయలేదు. మాస్‌ సినిమా అయినప్పటికీ కథలో, క్యారెక్టర్‌ లో చాలా ఫ్రెష్‌ నెస్‌ వుంటు-ంది. నేను సినిమా చూశాను. అద్భుతంగా వచ్చింది. ఫుల్‌ ఎంటర్‌ -టైమెంట్‌, మంచి పాటలు, డ్యాన్స్‌, ఫైట్స్‌ అన్నీ వున్నాయి. ఫ్యాన్స్‌ కి పండగలా వుంటు-ంది. అలాగే అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుంది.

y

ఎడిటర్‌గా ఉన్న రాజశేఖర్‌ దర్శకత్వం చేయగలడనే నమ్మకం మీకు ఎలా వచ్చింది ?
2017 ‘లై’ షూటింగ్‌ సమయంలో తన ఎడిటింగ్‌ స్టయిల్‌ నాకు బాగా నచ్చింది. అలాగే సినిమా గురించి మాట్లాడుతున్నపుడు తను ఇన్‌ పుట్స్‌ కూడా బావుండేవి. నువ్వు డైరెక్టరైతే బావుంటు-ంది అని అప్పుడే చెప్పాను. నేను చెప్పిన తర్వాత తనలో ఆలోచన మొదలైయింది. కోవిడ్‌ సమయంలో ఇంట్లో ఉంటూ కథ రాసుకున్నాడు. నాకు చెప్పినపుడు ఫస్ట్‌ సిట్టింగ్‌ లోనే ఓకే చెప్పేశాను.

ఐఎఎస్‌ పాత్ర కోసం హోం వర్క్‌ చేయడం, మేకోవర్‌ కావడం జరిగిందా ?
ఈ విషయంలో దర్శకుడు శేఖర్‌ చాలా హోం వర్క్‌ చేశారు. చాలా మంది ఐఎఎస్‌ అధికారులని కలవడం, వాళ్ళ బాడీ లాంగ్వేజ్‌ స్టడీ చేసి, షూటింగ్‌ సమయంలో ఎక్కడ హుందా గా వుండాలి, ఎక్కడ మాస్‌ గా ఉండాలనేది తనే చెప్పాడు.

- Advertisement -

యాధార్థ సంఘటనల స్ఫూర్తి ఉందా ?
లేదండీ. మాచర్ల నియోజకవర్గం పూర్తిగా ఫిక్షనల్‌ స్టొరీ. దర్శకుడు శేఖర్‌ది గుంటూరు. మాచర్ల అనే -టైటిల్‌ లో ఒక ఫోర్స్‌ వుంది. అందుకే మాచర్ల నియోజికవర్గం అని -టైటిల్‌ పెట్టాం.

కలెక్టర్‌ అంటే కొంచెం సాప్ట్‌ గా వుంటారు కదా.. ?
ఐఎఎస్‌ అంటే క్లాస్‌ అనుకుంటాం. కానీ ఆ పాత్ర మాస్‌ గా వుంటే ఎలా వుంటు-ందనే కొత్త అలోచనతోనే ఫ్రెష్‌ గా వెళ్లాం.

క్యాథరిన్‌ పాత్రని సర్పైజ్ర్‌ గా ఉంచారా ?
క్యాథరిన్‌ పాత్ర చిన్నదే అయినప్పటికీ కథలో చాలా కీలకం. ఒక కీ పాయింట్‌ ఆ పాత్రలో వుంటు-ంది.

సినిమాలో మీ పాత్రలో సవాల్‌ గా అనిపించిన అంశాలు ?
చాలా రోజుల తర్వాత చేసిన మాస్‌ యాక్షన్‌ ఫిల్మ్‌ ఇది. ఫైట్స్‌, లుక్‌ విషయంలో కొంచెం ఎకువ శ్రద్ధ తీసుకున్నా.

కృతి శెట్టిని స్మార్ట్‌ అన్నారు కదా ?
అవును. తన షూటింగ్‌ లో ప్రతిది చాలా లాజికల్‌ గా అడుగుతుంది. కృతి అడిగే ప్రశ్నలు చాలా స్మార్ట్‌ గా వుంటాయి. హీరోయిన్స్‌ లో అరుదైన క్యాలిటీ- ఇది.

మహతి స్వరసాగర్‌ సంగీతం గురించి ?
సాగర్‌ నాకు మంచి మ్యూజిక్‌ ఇస్తాడు. మా ఇద్దరి సింక్‌ బావుంటు-ంది,. మాచర్ల పాటలు సూపర్‌ హిట్‌ అయ్యాయి. నేపథ్య సంగీతం కూడా చాలా బాగా చేశాడు.

వరుస అపజయాలు వచ్చినపుడు మళ్ళీ బలంగా నిలబడాలనే స్ఫూర్తినిచ్చింది ఎవరు ?
ఇండియాలో ఎక్కువ ఫ్లాఫ్స్‌ ఇచ్చిన స్టార్స్‌ ఎవరు అని గూగుల్‌ చేసేవాడిని (నవ్వుతూ) అక్షయ్‌ కుమార్‌, హృతిక్‌ రోషన్‌ పేర్లు వచ్చేవి. వాళ్లని చూసి స్ఫూర్తి పొందేవాడిని. కొన్ని విమర్శలు బాధ కలిగించేవి. అయితే ఆ విమర్శలనే పాజిటీ-వ్‌ గా తీసుకొని ప్రయాణం కొనసాగించాను.

మీకు ప్రొడక్షన్‌ వుంది.. ప్రస్తుతం షూటింగ్‌ బంద్‌ నడిస్తుంది. నిర్మాత కోణంలో ఎలా చూస్తారు ?
ఒక నెలలో సమస్యలకు పరిష్కారం దొరికి మళ్ళీ షూటింగులు మొదలవుతాయని ఆశిస్తున్నాను.

విక్రమ్‌ సినిమా విషయంలో మీ సలహా వుందని నాన్నగారు చెప్పారు ?
సలహా అంటే .. సినిమా కొనమని మాత్రమే చెప్పాను. రేట్లు- జోలికి మాత్రం వెళ్ళను (నవ్వుతూ). విక్రమ్‌ చూసి వారం రోజులు నిద్రపట్టలేదు. సినిమా అంటే ఇలా వుండాలి కదా., ఇలా తీయాలి కదా అనిపించింది. ఒకే మూసలో వుండే ఫార్ములా కాకుండా.. కథని బలంగా నమ్మి చేస్తే విక్రమ్‌ లాంటి సినిమాలు వస్తాయి. భవిష్యత్‌ లో అలాంటి బలమైన కథలు వస్తే తప్పకుండా చేస్తా

ఇరవై ఏళ్ల ప్రయాణం తృప్తిగా ఉందా ?
ఇరవై ఏళ్ల ప్రయాణంలో చాలా హిట్స్‌ చూశాను. కొన్ని అపజయాలు కూడా చూశాను. ప్రస్తుతం మంచి స్థితిలో వుండటం తృప్తిగా వుంది. ఇంకా హార్డ్‌ వర్క్‌ చేసి నెక్స్ట్‌ లెవల్‌ కి వెళ్ళాలనేదే నా ప్లాన్‌.

Advertisement

తాజా వార్తలు

Advertisement