Monday, November 18, 2024

Covid-19: చైనాలో మళ్లీ కరోనా పడగ.. రెండేళ్ల గరిష్ఠ స్థాయికి కేసులు

క‌రోనా వైరస్ కు పుట్టిల్లు అయిన చైనాలో మ‌రోమారు మహమ్మారి విజృంభిస్తోంది. చైనాలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. రెండేళ్ల గరిష్ఠ  స్థాయికి కేసులు చేరాయి. చైనాలో కొత్తగా 3,400 కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటికే పలు పట్టణాల్లో లాక్ డౌన్ విధించారు.

క‌రోనాకు పుట్టిల్లు అయిన చైనాలో ఆదిలో కొంత‌మేర కేసులు అధికంగానే న‌మోదు అయినా.. 2020 మార్చి తర్వాత కేసులు వేగంగా త‌గ్గిపోయాయి. అయితే గత కొన్ని రోజులుగా చైనాలో రోజువారీ అత్యధిక కేసులు నమోదవుతున్నాయి. గ్వాంగ్‌ డాంగ్, జిలిన్, షాన్‌ డాంగ్ ప్రావిన్సులలో మెజారిటీ కేసులు నమోదవుతున్నట్లు అధికారులు తెలిపారు. హాంకాంగ్‌లో కూడా భారీగా కరోనా కేసులు వెలుగు చూస్తున్నాయట‌. దీంతో ఆయా ప్రాంతాల్లో ప‌రిస్థితికి త‌గ్గ‌ట్లుగా అధికారులు ఆంక్ష‌ల‌ను అమ‌లు చేస్తున్నారు. చైనాకు చెందిన ఈశాన్య న‌గ‌రం చాంగ్ చున్‌లో కరోనా కొత్త వేరియంట్ బ‌య‌టప‌డింది. ఈ వేరియంట్ చాలా వేగంగా విస్త‌రిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement