మధ్యప్రదేశ్ రాష్ట్రం జబల్పూర్లోని దుమ్నా విమానాశ్రయంలో ఇవ్వాల ల్యాండ్ అవ్వడానికి ముందు ఓ విమానం గతి తప్పింది. దీంతో విమానాన్ని చూడ్డానికి వచ్చిన టూరిస్టులు, విమానంలో ఉన్న ప్యాసెంజర్స్ అంతా భయభ్రాంతులకు గురయ్యారు. ఢిల్లీ నుంచి 55 మంది ప్రయాణికులు, ఐదుగురు సిబ్బందితో మధ్యాహ్నం 1.15 నిమిషాలను దుమ్నా ఎయిర్పోర్ట్ కు చేరిన విమానం ATR 2600.. ల్యాండింగ్ సమయంలో రన్‌అవే అయ్యింది. దీంతో త్వరగా ప్రయాణికులను విమానాశ్రయంలోని అరైవల్ హాల్‌కు తరలించారు.
కాగా, ఈ ఘటనపై భారత పౌర విమానయాన నియంత్రణ సంస్థ – డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) దర్యాప్తునకు ఆదేశించింది. టేకాఫ్ లేదా ల్యాండింగ్ సమయంలో విమానం రన్‌వే నుండి జారిపోవడాన్ని రన్‌అవే విహారం అంటారు. వాతావరణ పరిస్థితులు, సాంకేతిక సమస్యలు లేదా రన్‌అవేకి తలెత్తిన పరిస్థితులు, అనేక కారణాల వల్ల విమానం భూమిపై వేగాన్ని పెంచుతున్నప్పుడు దాని మార్గం నుండి దూరంగా వెళ్తుందని అధికారులు తెలిపారు. ఈ ఘటనకు కారణమేమిటనే వివరాలు ఇప్పటి వరకు తెలియరాలేదు. 1996లో తొలిసారిగా తన సేవలను ప్రారంభించిన అలయన్స్ ఎయిర్ ఈ ఘటనకు సంబంధించి ఇంకా బహిరంగ ప్రకటన విడుదల చేయలేదు.