Sunday, November 17, 2024

అవినీతి ఆరోప‌ణ‌లు.. ఏక‌కాలంలో 21 మంది ఆఫీస‌ర్ల ఇంటిపై రైడింగ్స్‌!

ఆవినీతి ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న 21 మంది ఆఫీస‌ర్ల ఇళ్ల‌ల్లో ఏక‌కాలంలో రైడింగ్ జ‌రుగుతోంది. ఇది కర్నాటక రాష్ట్రంలో ఇవ్వాల ఉద‌యం ఏసీబీ తీసుకున్న గొప్ప నిర్ణ‌యం అంటున్నారు. అయితే.. ఎన్నికలు సమీపిస్తున్న వేళ కర్నాటక ప్రభుత్వం ఈ నిర్ణ‌యం తీసుకున్నట్టు తెలుస్తోంది. అక్రమాస్తులు కలిగిఉన్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న 21 మంది ప్రభుత్వ అధికారుల ఇండ్లపై అవినీతి నిరోధక శాఖ (ACB) దాడులు నిర్వహిస్తున్నది.

క‌ర్నాట‌క రాష్ట్రవ్యాప్తంగా 80 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు చేప‌ట్టారు ఏసీబీ అధికారులు. ఈ దాడుల్లో 300 మంది అధికారులు పాల్గొన్నారు. లంచ‌గొండి ఆఫీస‌ర్ల నుంచి పలు కీలకమైన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. క‌ర్నాట‌ అసెంబ్లీకి వచ్చే ఏడాది ఎన్నికలు జరుగనున్నాయి.

2018లో జరిగిన ఎన్నికల్లో ఏ పార్టీకి అధికారం రాకపోవడంతో కాంగ్రెస్‌, మాజీ ప్రధాని దేవెగౌడ నేతృత్వంలోని జేడీఎస్‌ పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. అయితే కూటమిలో చీలిక రావడంతో ఏడాది కాలంలోనే ఆ ప్రభుత్వం పడిపోయింది.

అనంతరం యెడియూరప్ప సారథ్యంలో బీజేపీ ప్రభుత్వం కొలువుదీరింది. అయితే అవినీతి ఆరోపణలు రావడంతో బీజేపీ అధినాయకత్వం ఆయనను పదవినుంచి తొలగించి బస్వరాజ్‌ బొమ్మైని ముఖ్యమంత్రిని చేసిన విషయం తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement