Friday, November 22, 2024

Save Singareni: సింగరేణిలో సమ్మె సైరన్..

సింగరేణిలో సమ్మె సైరన్ మోగింది. ఈ రోజు నుంచి మూడు రోజుల పాటు సమ్మెకు కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. తెలంగాణలోని నాలుగు బొగ్గు బ్లాకులను వేలం వేయాలన్న కేంద్రం నిర్ణయానికి వ్యతిరేకంగా నిరసనకు దిగాయి. రాష్ట్రంలోని నాలుగు బొగ్గు బ్లాకులు సింగరేణికి కాకుండా ప్రైవేటు సంస్థలకు అప్పగించడాన్ని కార్మికులు వ్యతిరేకిస్తున్నారు.

గుర్తింపు యూనియన్ టీబీజీకేఎస్, జాతీయ కార్మిక సంఘాలు ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, సీఐటీయూ, హెచ్ఎంఎస్, బీఎంఎస్ జేఏసీగా ఏర్పడి సమ్మెకు దిగాయి. నేటి నుంచి 72 గంటల పాటు సింగరేణిలో ఉన్న 45 గనులు 19 ఓసీపీలు, 25 భూగర్భ కేంద్రాల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోనుంది. రోజుకు 2 లక్షల టన్నుల చొప్పున మూడు రోజుల్లో 6 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తికి విఘాతం కలగనుందని యాజమాన్యం తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement