Friday, November 22, 2024

Breaking: వరంగల్ జిల్లాలో మిర్చికి ఆల్ టైం రికార్డు ధర

తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ జిల్లాలో మిర్చి ఆల్ టైం రికార్డు ధర పలికింది. కొత్త రకం మిర్చి ధర రికార్డు క్రియేట్ చేసింది. కొత్త మిర్చి రకానికి ఫుల్ డిమాండ్ పెరిగింది. బంగారం ధరను మించిపోయింది. జిల్లాలోని ఏనుమాముల మార్కెట్ లో కొత్త మిర్చి ధర రూ.81,000లు పలికింది. ఏనుమాముల మార్కెట్ చరిత్రలోనే దేశీయ మిర్చికి అత్యధిక ధర ఇదే. క్వింటాల్ మిర్చి ఏకంగా రూ.81,000 పలికి ఆల్ టైం రికార్డు క్రియేట్ చేసింది. ప్రస్తుతం తులం బంగారం ధర రూ.53 వేలు ఉండటంతో మిర్చి ధర బంగారం ధర కంటే ఎక్కువగా పెరిగిపోవడంతో రైతన్నలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈనెల మొదటి వారంలో ఈ మిర్చి ధర రూ.10,100లు పలుకగా.. ఇప్పుడు రూ.81000 లు ధర పలుకుతోంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement