అమరావతి: రెండో దశ పంచాయతీ పోలింగ్ రేపు జరగనున్నది.. ఇప్పటికే పోలింగ్ కు ఏర్పాట్లు పూర్తి చేశామని పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి జీకే ద్వివేది ప్రకటించారు. రెండో దశలో 3,328 పంచాయతీల్లో 539 ఏకగ్రీవమయ్యాయని తెలిపారు. 33,570 వార్డు స్థానాల్లో 12,604 ఏకగ్రీవమయ్యాయని చెప్పారు. రెండో దశ ఎన్నికలకు 29, 304 పోలింగ కేంద్రాలు ఏర్పాటు చేశామని ద్వివేది తెలిపారు. 5,480 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు గుర్తించామన్నారు. 4,181 అతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలున్నాయని పేర్కొన్నారు. 47,492 మంది సిబ్బందితో రెండో దశ ఎన్నికలు నిర్వహిస్తున్నామని చెప్పారు. పోలింగ్, లెక్కింపు కేంద్రాల దగ్గర పటిష్ట భద్రత ఏర్పాటు చేశామని ద్వివేది పేర్కొన్నారు. రెండోవిడత జరగనున్న పంచాయతీ పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించేందుకు అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలలో వెబ్ కాస్టింగ్‌కు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. పోలింగ్, కౌంటింగ్ పర్యవేక్షణకు ప్రతి మూడు మండలాలకు ఒక ప్రత్యేక అధికారిని నియమించినట్టు అధికారులు చెప్పారు
Advertisement
తాజా వార్తలు
Advertisement