Friday, November 22, 2024

All Set – బిజెపిలో ట‌చ్ లో 22 మంది నేత‌లు …. త్వ‌ర‌లో భారీ చేరిక‌లుంటాయ‌న్న ఈట‌ల

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: అసెంబ్లి ఎన్నికలు దగ్గరపడు తున్న వేళ పార్టీలోకి భారీగా బలమైన నేతలను చేర్చుకుని క్యాడర్‌లో కొత్త ఉత్సాహాన్ని నింపేందుకు తెలంగాణ బీజేపీ సన్నద్ధమైంది. ఈ నెల 27న బీజేపీ అగ్రనేత కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా వస్తున్న నేపథ్యంలో పార్టీలోకి కొత్త నేతల వలసలపై ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వం మూహర్తం ఖరారు చేసి నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ నేతలపై కన్నేసింది. కొత్తగా ఎమ్మెల్యే టికెట్‌ ఆశించి రాదని నిర్ధారించుకున్న, ఇప్పటికే ఒకటి రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసి ఈసారి బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ల నుంచి టికెట్‌ ఆశించినా మొండిచేయి ఎదురవడం ఖాయమనుకుంటున్న నేతలను తనవైపు తిప్పుకునేందుకు బీజేపీ వ్యూహాత్మకంగా ముందుకు కదులుతోంది.

ఈ నేపథ్యంలో 22 మంది కీలక నేతలు బీజేపీలో చేరబోతున్నారంటూ పార్టీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్‌ ఈటల రాజేందర్‌ చేసిన ప్రకటన ఇప్పుడు రాజకీ యంగా ప్రాధాన్యత సంతరించుకుంది. అదే సమయంలో ఖమ్మం నుంచి త్వరలో బీజేపీలోకి చేరికలుంటాయని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఇటీవల ఖమ్మం పర్యటనలో ప్రకటించారు. అదే సమయంలో నిర్మల్‌లో ఎమ్మెల్యే రఘునందన్‌రావు కూడా బీజేపీలో 22మంది ఎమ్మెల్యేలు చేరనున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో బీజేపీలో చేరబోయే ఆ 22 మంది నేతలు ఎవరు? అన్న దానిపై రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది.

రేపో మాపో అధికార బీఆర్‌ఎస్‌ తొలి జాబితా, ఆ తర్వాత కొద్ది రోజుల్లో కాంగ్రెస్‌ జాబితా కూడా విడుదల కానుందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో బీజేపీలోకి చేరికలు పెరు గుతాయని ఈటల సన్నిహిత నేతలు చెబుతున్నారు. బీఆర్‌ ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీల తొలి అభ్యర్థుల జాబితాలో చోటుదక్కక పోవచ్చని ఖాయమని భావిస్తున్న ఉమ్మడి వరంగల్‌తోపాటు నల్గొండ, హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాలకు చెందిన పలువు రు నేతలు ఇప్పటికే ఈటల రాజేందర్‌తో టచ్‌లోకి వెళ్లినట్లు తెలుస్తోంది.

రాష్ట్ర రాజకీయాల్లో ఈటల ప్రాధాన్యత ఉన్న నేత కావడంతోపాటు సీఎం కేసీఆర్‌ సన్నిహితుడిగా రెండు పర్యాయాలు మంత్రిగా పనిచేయడమే కాకుండా తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించడంతో పలు పార్టీల అసం తృప్త నేతలతోపాటు ఉద్యమకారులు కూడా అవసరమైతే బీజేపీ టికెట్‌ కోసం ఇప్పటికే ఈటలతో మాట ముచ్చట పూర్తిచేసినట్లు తెలుస్తోంది.
బీఆర్‌ఎస్‌లో ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో అసమ్మ తి రగులుతుండడంతో ఈటల రాజేందర్‌, రఘునందన్‌రావు చేసిన 22 మంది ముఖ్యనేతల చేరిక ప్రకటనకు ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నేపథ్యంలో ఈ నెల 27న అమిత్‌ షా తెలంగాణ పర్యటన.. ఖమ్మంలో బహిరంగసభ నేపథ్యంలో బీజేపీలో భారీగా చేరికలు ఉండేలా ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వం ఈటల నేతృత్వంలో కసరత్తును పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో ఈటలతో టచ్‌లో ఉన్న తమ నేతలు ఎవరనేది కాంగ్రెస్‌, అధికార బీఆర్‌ఎస్‌ ఆరా తీస్తున్నట్లు సమాచారం.

మరో మూడు నెలల్లో అసెంబ్లిd ఎన్నికలు జరగనుండడం తో బీజేపీని అభ్యర్థుల కొరత వేధిస్తోంది. బలమైన అభ్యర్థుల కోసం ఆ పార్టీ వేచిచూస్తోంది. టికెట్‌ ఆశించి రిక్తహస్తం ఎదు ర్కొన్న కాంగ్రెస్‌ పార్టీకి చెందిన నేతలే బీజేపీలో చేరనున్నట్లు బీజేపీలో చర్చ జరుగుతోంది. ప్రస్తుతం కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీలో ఒక్కో నియోజకవర్గం నుంచి ఇద్దరు ముగ్గురు నేతలు పోటీపడుతున్న నియోజకవర్గాలు అధికంగానే ఉండడంతో టికెట్‌ రాని అసంతృప్త నేతలు బీజేపీ తీర్థం పుచ్చుకుని అసెంబ్లిd ఎన్నికల బరిలో దిగేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం అసెంబ్లిd ఎన్నికలకు బీజేపీ దూకుడుగా సన్నద్ధ మవుతోంది. ఇప్పటికే ఇతర రాష్ట్రాలకు చెందిన ఎమ్మెల్యేలను అన్ని అసెంబ్లిd నియోజక వర్గాలకు బీజేపీ పంపించింది. అదే సమయంలో బీజేపీ ముఖ్యనేతలు జిల్లాల్లో విస్తృతంగా పర్య టనలు చేస్తున్నారు. ప్రజా సమస్యలపై, ప్రభుత్వ వైఫల్యాలపై ధర్నాలు, నిరసనలతో రాష్ట్ర వ్యాప్తంగా హోరెత్తిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement