Tuesday, November 19, 2024

Bhadrachalam: నేడే శ్రీసీతారాముల కల్యాణ మహోత్సవం

తెలుగురాష్ట్రాల్లో శ్రీరామనవమి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. శ్రీరామ నవమి సందర్భంగా భద్రాచలంలో శ్రీసీతారాముల కల్యాణ మహోత్సవానికి సర్వం సిద్ధమైంది. ఈ రోజు ఉదయం వరకు మూలమూర్తులకు ఏకాతంగా తిరుకల్యాణం నిర్వహించనున్నారు. అనంతరం కల్యాన ఘట్టానికి వేదిక అయిన మిథిలా స్టేడియానికి ఉత్సవ మూర్తులను ఊరేగింపుగా తీసుకెళ్తారు. అయితే ముందుగా మిథిలా స్టేడియంలో పుణ్యాహవచనం, విశ్వక్సేన ఆరాధన నిర్వహించనున్నారు. తర్వాత యోత్ర ధారణ, కంకణ ధారణ, మాంగల్య ధారణ, తలంబ్రాల వేడుకలు నిర్వహిస్తారు. ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని నిర్వహిస్తారు.

ప్రభుత్వం తరఫున దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, రవాణా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ స్వామివారికి పట్టువస్ర్తాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పిస్తారు. సోమవారం శ్రీరామచంద్ర పట్టాభిషేక మహోత్సవం జరుగనుంది. ఈ వేడుకకు గవర్నర్‌ తమిళిసై హాజరవనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement