ఉక్రెయిన్ లో భారతీయులే కాదు..అక్కడి ప్రజలు సైతం లక్షలాదిగా దేశాన్ని విడిచి వలసలు వెళ్లుతున్నారు. భారత్ కూడా ఉక్రెయిన్ నుంచి విద్యార్థులు, వివిధ రంగాల నిపుణులను స్వదేశానికి తరలిస్తోంది. ఇప్పటికీ ఖర్కీవ్, మేరియుపోల్ వంటి నగరాల్లో భారత విద్యార్థులు వందల సంఖ్యలో ఉన్నట్టు ఉక్రెయిన్ లో భారత ఎంబసీ అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో, ఉక్రెయిన్ లో ఉంటున్న భారత పౌరులు అర్జంటుగా తమ ఫోన్ నెంబర్లు, లొకేషన్లను తెలియజేస్తూ తమను సంప్రదించాలని ఎంబసీ అధికారులు కోరారు. అందుకోసం ఆన్ లైన్ లో ఓ గూగుల్ ఫారంను పొందుపరిచారు. ఉక్రెయిన్ లో చిక్కుకుపోయిన భారత పౌరులు ఆ ఫారంను తమ వివరాలతో నింపాలని పేర్కొన్నారు. ప్రాథమిక వివరాలతో పాటు, ప్రస్తుతం ఎక్కడ ఉంటున్నారన్నది స్పష్టంగా తెలియజేయాలని వివరించారు. ఈ మేరకు ట్వీట్ చేశారు.
మీ ఫోన్ నెంబర్ ..లొకేషన్ షేర్ చేయండి – విద్యార్థులను కోరిన ఇండియన్ ఎంబసీ
Advertisement
తాజా వార్తలు
Advertisement