ఓట్ల బేర’సారా’లు
ఓటర్ల మనసు దోచేందుకు అభ్యర్థుల ప్రయత్నాలు
ఖర్చు ఎంతయినా సరే..ఓట్లు పడాల్సిందే!
ఓట్ల కోసం నాయకుల పోటా పోటీ
ఎన్నికల పోలింగ్ తేదీ దగ్గర పడుతున్న కొద్ది నేతల్లో టెన్షన్ మొదలైంది. ప్రచారానికి కేవలం 7 రోజులు, పోలింగ్‌కి 9 రోజులు మాత్రమే సమయం ఉండటంతో ప్రధాన పార్టీ అభ్యర్థులు రాజకీయ చదివింపులు స్టార్ట్ చేశారు. ఎలా అయినా ఎన్నికల్లో గెలిచి తీరాలని భగీర థ ప్రయత్నాలే చేస్తున్నా రు. అందివచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోకుండా ముందుకె ళ్తున్నా రు. అన్ని కేటాగి రీల ఓటర్లను టార్గెట్ చేస్తూ అడిగినంతా తాయిళాలు సమర్పిస్తున్నా రు. ఎన్నికల్లో పోటీపడే నూతన అభ్యర్థులు ఎమ్మెల్యేగా గెలిచి అధ్యక్ష అని అనాలని ఊవ్విళ్లు రుతున్నారు. ఇంతకముందు గెలిచిన నాయకులు ఈ సారి గెలిస్తే మంత్రి పదవి వరిస్తొందని చెమటోడుస్తున్నారు.
హైదరాబాద్, ప్రభన్యూస్: మహానగరంలో రోజు రోజు కి ఎన్నికల వేడి ముదురుతోం ది. చలికాలం మొదలైన నేత ల్లో ఎన్నికల వేడి తగ్గడం లేదు. రాత్రిం బవళ్లు ప్రచా రంలో పాల్గొంటూ చెమటలు తీస్తు న్నారు. గెలుపు కోసం ఎంతకైనా, దేనికైనా సిద్ధం అం టూ ఓటర్లను అకట్టు కునేందుకు నానా అవస్థలు పడు తున్నారు. ఉన్న కొద్ది సమయం నిద్ర లేకుండా గడిపిన గెలిచిన తర్వాత 5 సంవ త్సరాలు పదవి అనుభవించ వొచ్చని తహత హలాడు తున్నారు. సమయం తక్కువ ఉండటంతో ఓటర్ల మనసు గెల్చుకోవడానికి, తమ విజ యావకాళాలను మెరుగుపర్చుకోవడానికి అభ్యర్థులు ఎవరికి వారే విశ్వ ప్రయత్నాలు చేస్తూ, వ్యూహాలకు పదును పెడుతున్నారు.
కోటి వరాలైనా ఇస్తూ.. గంపగుత్తగా ఓట్లకు గాలం
గ్రేటర్లో అన్ని ప్రధాన పార్టీల మధ్య పోటాపోటీ నెలకొంది. అభ్యర్థులు తమ నియోజకవర్గంలోని అం దరూ ఓటర్లను ప్రసన్నం చేసుకొవడానికి అం దివచ్చిన శుభకార్యంతో సహా ఏ చిన్న అవకాశాన్ని వదులు కోవడం లేదు. పగలంతా కాలనీల్లో అన్ని వర్గాల ప్రజలను కలుసుకుంటూ ప్రచారం చేస్తున్నారు. రాత్రి సమయాల్లో బలమైన నాయకులు, కాలనీ పెద్దలను కలుస్తూ మద్దతు కూడగడుతున్నారు. గంపగుత్తగా ఓట్ల ను పొందేందుకు ఎవరికి వారే సంఘాలకు గాలం వేస్తున్నారు. వాటి ద్వారా ఏకంగా వందల సంఖ్యలో ఓట్లను రాబట్టేందుకు రాయబేరాలు సాగిస్తు న్నారు. నగర శివార్లలో ఫం క్షన్ హాళ్లను అద్దెకు తీసుకొని ప్రధాన పార్టీల నేతలు సంఘాల ప్రతినిధులతో భేటీ అవుతున్నారు. వారి డిమాండ్లు ఆరా తీసి నేరవేర్చేం దుకు హామీ ఇస్తూ ఓట్లను అభ్యర్థిస్తున్నారు. వచ్చిన వారికి అడిగిన బ్రాండ్ మందు అందిస్తూ, కోరిన వంటకాలతో దావత్‌లు ఇస్తున్నారు.
అన్ని వర్గాల వారితో సమావేశాలు..
నియోజకవర్గంలోని ప్రతి ఓటర్ను ఆక ట్టుకునేలా పథకాలు రచిస్తున్నారు. అలాగే గృహా నిర్మాణ కార్మి కులు, పెయింటర్లు, ఆటో డ్రైవర్లు, ప్రైవేటు ఉపా ధ్యాయులు, కుల, మహిళా సంఘాల భేటికి నేతలు ప్రా ధాన్యమిస్తున్నారు. ఏసీ గదుల్లో సేదతీరే వారు మరో వారం కష్టపడితే ఎమ్మెల్యే కుర్చీ తమదేననే ధీమాతో చెమ టోడు స్తున్నారు. జనబలం ఉండి ఓటర్లను ప్ర భావి తం చేసే నాయకులతో అర్ధరాత్రి వరకు మంతనాలు జరుపుతూ తమవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తు న్నారు. బలహీనంగా ఉన్న కాలనీల్లో చోటా మోటా నాయకులను, కుల సంఘాల ప్రతినిధులను మచ్చిక చేసుకోవడానికి ఖర్చుతో కూడుకున్న వారి కోరికలను తీర్చడానికి సిద్ధపడు తున్నా రు.
నియోజకవర్గంలోని పలు ఏరియాల్లో మంచి పలుకుబడి ఉన్న ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు చివరి క్షణంలో పార్టీ ఫిరాయించకుండా ఉండేందుకు అన్ని ప్ర ³యత్నాలు చేస్తున్నారు. ఓ వైపు దావత్‌లు మరోవైపు తమ కాల నీల్లో సమస్యలు తీరే మార్గం కనిపించడంతో ఓటర్లు ఎంజాయ్ చేస్తున్నారు. అన్ని పార్టీల అభ ్యర్థుల అతిథ్యం స్వీకరిస్తూనే ఎవరైతే ఎక్కువ డబ్బు ఇస్తారో వారికే తమ ఓటు అని అనడం గమనార్హం. పార్టీ బలబలాల ఆధారంగా నేతలు ముందుకు సాగుతున్నారు. తమ పార్టీకి ఏ ఏరియాల్లో మంచి పట్టుంది, వీక్‌గా ఉన్న బూత్ లలో అనుసరించాల్సిన వ్యూహాలు తదితర వాటిపై ఫోకస్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. గత ఎన్నికల్లో ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చాయనే వివరాల ఆధారంగా ప్రస్తుతం ఎన్ని ఓట్లు పడతాయనేది ఎవరికి వారే లెక్కలేసుకుంటున్నారు.
ఫలానా బూత్‌లో అధిక్యత తమదంటే తమదని ప్రచారం చేసుకుంటున్నారు. ప్రచారంలో ప్రధాన పార్టీల అభ్యర్థులు ఎత్తుకు పైఎత్తులు వేస్తూ ముం దుకు సాగుతున్నాయి. ఓ దఫా ప్రచారం పూర్తి చేసుకున్న నేతలు ఓటరు ప్రసన్నానికి ప్రణాళికలు రూపొం దిస్తు న్నారు. ఇందుకు కాలనీల్లో ఉండే యువజన సంఘా లకు ఆట పరికరాలు, కుల సంఘాలకు వంట పాత్రలు, దేవాలయాల నిర్మాణాలకు విరాళాలు అందజేస్తు న్నారు. తాయిళాల వ్యవహారమంతా ఆయా కాలనీల ముఖ్య నాయకుల కనుసన్నల్లో నడిచేలా పకడ్బందీ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు.