Saturday, November 23, 2024

Breaking: తెలంగాణలో విద్యాస్థంస్థలు పునః ప్రారంభం

తెలంగాణలో విద్యాసంస్థలు ఇవాళ్టి నుంచి పున:ప్రారంభం కానున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలు, కళాశాలలు, విశ్వ విద్యాలయాలు పునః ప్రారంభం కానున్నాయి. సంక్రాంతి సెలవుల్లో భాగంగా జనవరి 8వ తేదీ నుంచి విద్యాసంస్థలన్నీ మూతపడ్డాయి. రాష్ట్రంలో కరోనా ఉధృతి నేపథ్యంలో ఆ సెలవులను జనవరి 31వ తేదీ వరకు ప్రభుత్వం పొడిగించింది. అయితే, ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా కరోనా కేసులు  తగ్గుముఖం పట్టుతుండటంతో విద్యాసంస్థలు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో నేటినుంచి తిరిగి ప్రారంభం కానున్నాయి.

ప్రైవేట్‌ పాఠశాలలు ప్రత్యక్ష తరగతులు ప్రారంభించేందుకు సన్నద్ధమయ్యాయి. విశ్వవిద్యాలయాలూ ప్రత్యక్ష తరగతులను ప్రారంభిస్తున్నాయి. ఇప్పటివరకూ ఆన్ లైన్ క్లాసులు నడుస్తున్నాయి. అయితే, సీబీఎస్‌ఈ పాఠశాలలు ఈనెల 2 నుంచి ప్రారంభిస్తామని తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు.

అన్ని విద్యాసంస్థల్లో కోవిడ్-19 భద్రతా జాగ్రత్తలు కచ్చితంగా అమలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. పాఠశాలల నిర్వహణ, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు తగిన కోవిడ్-19 భద్రతా చర్యలు తీసుకోవాలని తెలిపింది. అన్ని పాఠశాలల్లో విద్యార్దులు, ఉపాధ్యాయులు, సిబ్బంది కరోనా నిబంధనలు పాటించనున్నారు. మాస్క్, భౌతిక దూరం, శానిటైజర్ ఖచ్చితంగా అమలు చేయనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement