Wednesday, November 20, 2024

Covid Vaccine: 18 ఏళ్లు దాటిన వారందరికీ బూస్టర్ డోసు

కరోనా కట్టడికి ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. పలు దేశాల్లో మినహా చాలా దేశాల్లో కరోనా అదుపులోకి వచ్చింది. కరోనా టీకాల విషయంలో అనుకున్న లక్ష్యాన్ని చేరుకునేందుకు అగ్రరాజ్యం అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై 18 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికీ బూస్టర్ డోసు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు ఫైజర్, మోడెర్నా బూస్టర్ డోసులకు అమెరికా ఆహార, ఔషధ సంస్థ (ఎఫ్‌డీఏ) అనుమతి ఇచ్చింది.

ఇప్పటి వరకు 65 ఏళ్లు పైబడిన వారికి, వ్యాధి తీవ్రత అధికంగా ఉన్నవారికి బూస్టర్ డోసులు ఇస్తూ వస్తున్నారు. అమెరికా తాజా నిర్ణయంతో కోట్లాదిమందికి లబ్ధి చేకూరనుంది. శీతాకాలంలో కరోనా కేసులు మరింతగా పెరిగే అవకాశం ఉందన్న నిపుణుల హెచ్చరిక నేపథ్యంలోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. కాగా, రెండో డోసు తీసుకుని ఆరు నెలల దాటిన ప్రతి ఒక్కరు బూస్టర్ డోసు తీసుకోవచ్చు. గతంలో తీసుకున్న టీకాతో సంబంధం లేకుండా బూస్టర్ డోసు తీసుకోవచ్చని ప్రభుత్వం పేర్కొంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement