Tuesday, November 26, 2024

మ‌రోసారి వాయిదా ప‌డిన ఆలియా,ర‌ణబీర్ ల పెళ్లి

ఇప్ప‌టికే బాలీవుడ్ న‌టులు ఆలియాభ‌ట్, ర‌ణబీర్ క‌పూర్ ల పెళ్లి వాయిదా ప‌డింది. కాగా మ‌రోసారి వీరి పెళ్లి వాయిదా ప‌డిన‌ట్టు స‌మాచారం. బాలీవుడ్ లో ఇప్పుడు హాట్ టాపిక్ అంటే రణబీర్ కపూర్, అలియా భట్ పెళ్లి విషయమే. అయితే అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ జంట ముందుగా 14వ తేదీన పెళ్ళాడనున్నట్లు వార్తలు వినవచ్చాయి. అయితే ఈ పెళ్ళి వాయిదా పడబోతున్నట్లు సమాచారం. దానికి కారణం భద్రతాపరమైన ఆందోళన అని వినిపిస్తోంది. నిజానికి పెళ్ళి విషయం లీక్ కాగానే భద్రతపై దృష్టిసారించారు. ఇప్పుడు అదే కారణంతో వాయిదా కూడా వేస్తున్నారట. మరోవైపు ఈ పెళ్ళి వచ్చేవారానికి వాయిదా పడనుందని, ఏప్రిల్ 20న జరుగుతుందని అంటున్నారు. ఇదే విషయమై రణబీర్ తల్లి నీతూ కపూర్ ఓ సినిమా సెట్స్‌లో మీడియాతో మాట్లాడుతూ తనకు తెలియదని, ఎప్పుడు జరుగుతుందో చూద్దామని వ్యాఖ్యానించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement