స్టార్ నటులు ఆలియాభట్, రణబీర్ కపూర్ల ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ స్టార్ట్ అయ్యాయి. కాగా ముంబైలోని పాలీ హిల్స్‌లో ఉన్న వాస్తూ రెసిడెన్సీలో ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా ఉదయం 11 గంటలకు గణేశ్ పూజ జరిగింది. మధ్యాహ్నం 3 గంటలకు మెహిందీ సెర్మనీ జరుగనుంది. చాలా గోప్యంగా ఈ వేడుకలను నిర్వహిస్తున్నారు. కేవలం ఫ్యామిలీ సభ్యులు, రణ్‌బీర్, ఆలియాతో సన్నిహితంగా ఉండే మిత్రులకు మాత్రమే ఆహ్వానం అందినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వాస్తు బిల్డింగ్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ వేడులకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు మీడియాకు రిలీజ్ కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా వేడుకల్లో పాల్గొనే సిబ్బంది ఫోన్లకు రెండు వైపులా ఎరుపు రంగులో ఉన్న స్టిక్కర్లు అంటిస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నది.
Advertisement
తాజా వార్తలు
Advertisement