Friday, November 22, 2024

క‌రోనాపై అలెర్ట్.. నేడు కేంద్ర ఆరోగ్య శాఖ వీడియో కాన్ఫ‌రెన్స్

దేశంలో రోజు రోజుకు కోవిడ్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతోంది. గ‌త కొన్నిరోజులుగా ప్రతిరోజూ వెయ్యికి పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. దేశవ్యాప్తంగా కరోనా కేసులు వేగంగా పెరగడానికి XBB 1.16 వేరియంట్ కారణమని చెబుతున్నారు. కరోనా కేసులు ఐదు నెలల గరిష్టానికి చేరుకోవడం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది.

నేడు అన్ని రాష్ట్రాలతో కేంద్ర ఆరోగ్య‌శాఖ‌ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనుంది. కరోనా కేసుల కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై రాష్ట్రాలతో చర్చించనుంది. ఇప్పటికే కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా ఎక్కువ కేసులు నమోదు చేస్తున్న రాష్ట్రాలకు కేంద్రం మార్గదర్శకాలను జారీ చేసింది. కేరళ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ, గుజరాత్ రాష్ట్రాలలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని కేంద్రం హెచ్చరించింది. ఏప్రిల్ 10, 11 తేదీల్లో కరోనాపై కేంద్రం మాక్ డ్రిల్ నిర్వహించనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement