Saturday, November 23, 2024

రేపు, ఎల్లుండి SBI ఆన్‌లైన్ సేవలు బంద్

దేశంలోని అతి పెద్ద పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా(SBI) కీలక ప్రకటన చేసింది. తమ బ్యాంకుకు చెందిన ఇంటర్నెట్ బ్యాంకింగ్, యోనో మొబైల్ అప్లికేషన్‌కు సంబంధించిన ఆన్‌‌లైన్ సేవలకు రెండు రోజుల పాటు కాస్త అంతరాయం కలుగుతుందని ప్రకటించింది. ఈనెల 6న రాత్రి 10:45 నిమిషాల నుంచి ఈనెల 7 మధ్యాహ్నం 1:15 నిమిషాల వరకు SBIకి సంబంధించిన ఆన్‌‌లైన్ సేవలకు అంతరాయం కలుగుతుందని పేర్కొంది.

SBI ఇంటర్నెట్ బ్యాంకింగ్‌తో పాటు యోనో మొబైల్ అప్లికేషన్ నిర్వహణ పనుల కారణంగా రెండు రోజుల పాటు ఆన్‌ లైన్‌ సేవలకు అంతరాయం కలుగుతుందని బ్యాంకు వర్గాలు వెల్లడించాయి. ఈ సౌకర్యంపై తాము చింతిస్తున్నామని, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాదారులు ఈ అంతరాయాన్ని దృష్టిలో ఉంచుకుని తమ బ్యాంక్‌ లావాదేవీలను తాము సూచించిన సమయం కంటే ముందు లేదా తర్వాత పూర్తి చేయాలని సూచించింది.

ఈ వార్త కూడా చదవండి: భారీ లాభాలను ఆర్జించిన SBI

Advertisement

తాజా వార్తలు

Advertisement