Friday, November 22, 2024

Alert: తెలంగాణలో వాయిదా పడిన పరీక్షలు.. కొత్త షెడ్యూల్ విడుదల

తెలంగాణలో ఈ నెల ఏడో తేదీ నుంచి ప్రారంభం కావాల్సిన ఒకటి నుంచి 9వ తరగతి పరీక్షలు వాయిదా పడ్డాయి. ఈ మేరకు విద్యాశాఖ పేర్కొంది. పరీక్షలకు కేవలం వారం రోజుల ముందు ఈ బుధవారం షెడ్యూల్ విడుదల చేయడంతో విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో విద్యాశాఖ తాజా నిర్ణయం తీసుకుంది. వారం రోజుల్లోనే పరీక్ష పత్రాలు ముద్రించి వాటిని పాఠశాలలకు చేరవేయడం ఎలా సాధ్యమన్న ప్రశ్నలు తలెత్తడంతో పరీక్షలను 9 రోజుల పాటు వెనక్కి జరిపి ఈ నెల 16 నుంచి నిర్వహించాలని నిర్ణయించారు. ఈ నెల 16 నుంచి 22 వరకు పరీక్షలు జరుగుతాయంటూ గతరాత్రి విద్యాశాఖ కొత్త షెడ్యూల్‌ను విడుదల చేసింది. కాగా, ఈ నెల 22న పరీక్షలు ముగియనుండగా 23న ఫలితాలు వెల్లడించాల్సి ఉంటుంది. ఆ తర్వాతి రోజు నుంచి పాఠశాలలకు వేసవి సెలవులు ప్రారంభం కానున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement