స్మార్ట్ ఫోన్ యూజర్లను టార్గెట్ చేస్తూ కొత్త వైరస్ వదిలారు హ్యాకర్లు. గతంలో కూడా ఇట్లాంటి వైరస్‌తో జనాలను భయపెట్టారు. ఈ ఏడాది జూలైలో వచ్చిన జోకర్ వైరస్ మళ్లీ యూజర్లను ఇబ్బందిపెడుతోంది. ఇప్పుడు మళ్లీ ఈ వైరస్ గూగుల్ ప్లే స్టోర్ లో వచ్చి ఉలిక్కిపడేలా చేస్తోంది.
దీనిపై గూగుల్ కీలక ప్రకటన చేసింది. ఈ మాల్వేర్ ఆండ్రాయిడ్ యాప్‌లలో దాగి ఉందని, మీ ఫోన్‌లో ఉన్న 15 యాప్స్‌ను వెంటనే డిలీట్ చేయాలని సూచించింది. కాస్పర్ స్కై ల్యాబ్స్‌లోని ఆండ్రాయిడ్ మాల్వేర్ అనలిస్ట్ టాట్యానా షిష్కోవా ఈ వైర్‌ను గుర్తించినట్లు ట్విటర్‌లో వెల్లడించింది. అయితే ఈ ప్రమాదకరమైన వైరస్ 2017లో బయటపడింది.
ఆండ్రాయిడ్ ఫోన్‌లలో వినియోగదారునికి తెలియకుండానే విలువైన డేటాను తస్కరిస్తుంది. ప్రమాదానికి గురైన 15 యాప్స్‌ను గూగుల్ తన ప్లేస్టోర్ నుంచి తొలగించింది. అయితే .. కొంతమంది ఈ యాప్స్ ఉపయోగిస్తుంటే కనుక వెంటనే తొలగించు కోవాలని, లేకపోతే డేటా ప్రమాదంలో పడే అవకాశం ఉంటుందని హెచ్చరిస్తోంది గూగుల్. అయితే ఈ వైరస్ వినియోగదారును అనుమతి లేకుండానే డేటా సేకరించి బ్యాంకు ఖాతాలను ఖాళీ చేస్తున్నట్టు సమాచారం.
జోకర్ మాల్వేర్ సోకిన యాప్స్ ఇవే..
- Easy PDF Scanner
- Blender Photo Editor-Easy Photo Background Editor
- Now QR Code Scan
- Super-Click VPN
- Flashlight Flash Alert on Call
- Halloween Coloring
- Volume Booster Louder Sound Equalizer
- Battery Charging Animation Bubble Effects
- Smart TV Remote
- Volume Boosting Hearing Aid
- EmojiOne Keyboard
- Classic Emoji Keyboard
- Super Hero-Effect
- Dazzling Keyboard
- Battery Charging Animation Wallpaper