Monday, November 25, 2024

Alert Alert | నేటి నుంచి కరెంట్ కోతలు.. కారణమిదే!

హైదరాబాద్ సిటీ జ‌నానికి అలర్ట్. నేటి (బుధ‌వారం నుంచి సిటీలోని చాలా ప్రాంతాల్లో కరెంట్ కోతలు అమల్లోకి రానున్నాయి. వార్షిక నిర్వహణ, రిపేర్ల వంటి పనుల్లో భాగంగా ఈ కోతలను అమలు చేస్తున్నట్టు టీఎస్ఎస్ఏపీడీసీఎల్ ఎండీ ముషారఫ్ అలీ ఫారూఖీ తెలిపారు. విద్యుత్ కోతల వల్ల ప్రజలకు కలిగే అసౌకర్యానికి చింతిస్తున్నామని.. జీహెచ్ఎంసీ పరిధిలోని పలు ప్రాంతాల్లో పవర్ కట్స్ ఉంటాయని అన్నారు. నేటి నుంచి ఫిబ్రవరి 10వ తేదీ వరకు పవర్ కట్స్ ఉంటాయని చెప్పారు.

రెండు గంట‌ల కోత‌..
వేసవి, యాసంగి సీజన్‌లో అధిక విద్యుత్ డిమాండ్‌కు సిద్ధం కావడానికి వార్షిక నిర్వహణలో భాగంగా.. రెండు గంటలపాటు విద్యుత్ కోతలు ఉండే చాన్స్ ఉందని అధికారులు చెప్పారు. మెయింటెనెన్స్ పనుల్లో భాగంగా విద్యుత్ తీగలపైకి పెరిగిన చెట్లకొమ్మలు తొలగించడం, విద్యుత్ లైన్లను సరిచూసుకోవడం, అవసరమైతే కొత్తవాటిని వేయడం వంటివి కూడా చేస్తామని ముషారఫ్ తెలిపారు. విద్యుత్ కోతలు ఉంటాయని చెప్పినంత మాత్రం రోజువారీ ఉండవని, ఒక్కో ఫీడర్ ఒక్కో రోజు మాత్రమే ఉంటాయని పేర్కొన్నారు.

రిపేర్లు జ‌రిగే ప్రాంతాల్లోనే..
GHMC పరిధిలో దాదాపు 3,000 బేసి ఫీడర్‌లు ఉన్నాయని.. నేటి నుంచి (జనవరి 17) ఫిబ్రవరి 10, 2024 వరకు (ఆదివారాలు , పండుగలు మినహా) 15 నిమిషాల నుండి 2 గంటల వరకు విద్యుత్ నిలిపేసి నిర్వహణ పనులను పూర్తి చేయాలని క్షేత్ర స్థాయి సిబ్బందిని ఆదేశించామన్నారు. నిర్వహణ పనులు జరిగే ప్రాంతాల్లో మాత్రమే పవర్ కట్స్ ఉంటాయని చెప్పారు. విద్యుత్ అంతరాయాలకు సంబంధించిన వివరాలు http://tssouthernpower.com వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేస్తామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement