గుజరాత్ లో కల్తీ మద్యం కలకలం రేపింది. ఈ మద్యం సేవించి 21మంది మృతి చెందారు. మరికొందరి పరిస్థితి విషమంగా ఉంది.మృతుల్లో ఎక్కువ మంది కూలీలు ఉన్నారు. గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ATS), అహ్మదాబాద్ క్రైమ్ బ్రాంచ్ రంగంలోకి దిగి విచారణ ప్రారంభించాయి. బోటాడ్ జిల్లాలో ఇప్పటివరకు 16 మంది మృతి చెందారు. ధందుక, భావ్‌నగర్‌లో మరో ఐదుగురు మృతి చెందారు. భావ్‌నగర్, బోటాడ్, బర్వాలాలోని ఆసుపత్రుల్లో మరికొందరు బాధితులు చికిత్స పొందుతున్నారని అధికారులు తెలిపారు. కల్తీ మద్యం తయారుచేస్తున్న బోటాడ్ జిల్లాకు చెందిన ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బోటాడ్ జిల్లాలోని రోజిద్ గ్రామంలోని పలువురు, ధందుక, భావ్‌నగర్ ప్రాంతాల్లో కొందరు కల్తీ మద్యం తాగి అస్వస్థతకు గురయ్యారు. ఆ తర్వాత మరణాల సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తుంది.ఈ ఘటనపై విచారణ కోసం ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసింది. గుజరాత్ టెర్రరిజం స్క్వాడ్, అహ్మదాబాద్ క్రైమ్ బ్రాంచ్ సైతం దర్యాప్తులో చేరాయని బొటాడ్ పోలీస్ సూపరింటెండెంట్ కరణరాజ్ వాఘేలా తెలిపారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement