Tuesday, November 26, 2024

ఆ జిల్లాకు ANR పేరు పెట్టండి.. ఏపీ సర్కార్ కు అక్కినేని ఫ్యాన్స్ డిమాండ్

ఆంధ్రప్రదేశ్ లో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ శరవేగంగా సాగుతుంది. ప్రస్తుతం ఉన్న 13 జిల్లాలు ఇప్పుడు 26 జిల్లాలుగా మారనున్నాయి. ఇదే సమయంలో జిల్లా పేర్లకు సంబంధించి కొత్త డిమాండ్లు తెరపైకి వస్తున్నాయి. ఇప్పటికే విజయవాడ కేంద్రంగా ఏర్పడే జిల్లాలకు ఎన్టీఆర్ పేరు పెట్టారు. అయితే, తాజాగా టాలీవుడ్ దిగ్గజ నటుడు అక్కినేని నాగేశ్వరరావు పేరు  తెరపైకి వచ్చింది. జిల్లాల పునర్విభజనలో భాగంగా ఏర్పడనున్న మచలీపట్నం జిల్లాకు దివంగత నటుడు అక్కినేని నాగేశ్వరరావు పేరు పెట్టాలని అక్కినేని అభిమానులు కోరుతున్నారు.

ఏపీ ప్రభుత్వం తమ కోరికను దృష్టిలో పెట్టుకోవాలని ఆలిండియా అక్కినేని అభిమాన సంఘం అధ్యక్షుడు సర్వేశ్వరరావు కోరుతున్నారు. గుడివాడ రామపురంలో జన్మించిన  అక్కినేని నాగేశ్వరరావు విభిన్న పాత్రలతో తెలుగు ప్రేక్షకులను అలరించారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో అక్కినేని చేసిన సేవకు దాదాఫాల్కే అవార్డు వంటి అనేక అవార్డులు అందుకున్నారు. విద్యా, సామాజిక సేవల్లోను ఎంతో తోడ్పాటు అందించారు. తెలుగు వారికి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తీసుకువచ్చిన మహావ్యక్తి అని సర్వేశ్వరరావు చెప్పారు. ఏఎన్నార్ కళారంగానికి చేసిన సేవలకు గాను ఆయన పేరుతో జిల్లా ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement