Saturday, November 23, 2024

అఖీరా గ్రాడ్యుయేష‌న్ డేలో రేణుతో క‌లిసి ఫొటోల‌కు పోజిచ్చిన ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌ణ్ క‌ళ్యాణ్ అంటే అభిమానులు దేవుడితో స‌మానంగా భావిస్తుంటారు. అయితే త‌న కుమారుడు అకీరా నందన్, మాజీ భార్య‌ రేణూదేశాయ్‌తో కలిసి దిగిన ఫొటోలు కొన్ని తాజాగా సోష‌ల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అకీరా స్కూల్‌లో గ్రాడ్యుయేషన్ డే సోమవారం జరిగింది. ఇండస్ ఇంటర్నేషనల్ స్కూల్‌ గ్రాడ్యుయేషన్ డే అంటూ అభిమానులు ట్వీట్లు పెడుతున్నారు. ఈ స్కూల్‌ గ్రాడ్యుయేషన్ ఈవెంట్‌లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సందడి చేశారు. అకీరా కోసం పవన్ కళ్యాణ్ వచ్చారు.

తన ఫ్యామిలీతో కలిసి ఫొటోలకు పోజులిచ్చారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతున్నాయి. పవన్ కళ్యాణ్, రేణూ దేశాయ్ ఇద్దరూ విడిపోయి దూరంగా ఉన్నా కూడా.. పిల్లల కోసం తమ తమ పట్టింపులను పక్కన పెట్టేసినట్టు కనిపిస్తోంది. అకీరా నందన్, ఆద్యల‌ను మధ్య మధ్యలో పవన్ కలుస్తుంటారు. ఆ మధ్య రేణూ దేశాయ్ ఇంట్లో పవన్ కళ్యాణ్ తన పిల్లలతో ప్రేమగా ఉన్న ఫొటోలు కూడా పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement