ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ప్రతిపక్ష నేతగా వ్యవహరించనున్నారు. ఆయన పార్టీకి చెందిన 111 మంది శాసనసభ్యులు ఆయనను సమాజ్‌వాదీ పార్టీ శాసనసభా పక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారని పార్టీ అధికార ప్రతినిధి తెలిపారు. ప్రతిపక్షాలు అసెంబ్లీలో లేవనెత్తే అంశాలపై చర్చించేందుకు సమాజ్‌వాదీ పార్టీ మిత్రపక్షాల నేతలతో యాదవ్ సమావేశమవుతారని తెలిపారు.
యూపీలోని మెయిన్‌పురి జిల్లాలోని కర్హాల్ నుంచి తొలిసారి శాసనసభ్యుడిగా ఎన్నికైన అఖిలేష్ యాదవ్.. అజంగఢ్ ఎంపీ పదవికి రాజీనామా చేశారు. దీంతో యూపీ అసెంబ్లీలో ఆయన విపక్ష నేత కానున్నారు. రాజకీయంగా ప్రాముఖ్యత కలిగిన రాష్ట్రంలో 2027 ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలో బిజెపిని ఎదుర్కోవాలని అఖిలేష్ యాదవ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
కాగా, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారాన్ని నిలబెట్టుంది. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ప్రధాన సవాల్‌గా యాదవ్ నిలిచారు. మొత్తం 403-సభ్యుల అసెంబ్లీలో 111 స్థానాలను గెలుచుకుని రెండో స్థానంలో నిలిచారు. మరోవైపు యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయంతో యోగి ఆదిత్యానాధ్ సీఎంగా రెండోసారి పాలనా పగ్గాలు చేపట్టారు.