అఖిలేష్ యాదవ్ సోదరుడి భార్య అపర్ణయాదవ్ బిజెపిలో చేరారు. దీనిపై ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ స్పందించారు. బిజెపి భావజాలం చాలా ప్రమాదకరమైనదని చెప్పారు. అలాంటి ప్రమాదకరమైన భావజాలాన్ని కాకుండా త్వరలోనే ఎస్పీ భావజాలంలోకి బిజెపి వస్తుందన్నారు. అందుకు అపర్ణ యాదవ్ కృషి చేస్తారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. సమాజ్ వాదీ పార్టీలో సీటు దక్కకపోవడం వల్లే పలువురు బిజెపిలోకి చేరుతున్నారని చెప్పారు. సమాజ్ వాదీ పార్టీ భావాజాలం ఇతర పార్టీల్లో కూడా ఉండాలని అపర్ణ యాదవ్ చేస్తున్న కృషి మరవనిదని ఎద్దేవా చేశారు. అలాగే తమ పార్టీలో సీటు కేటాయించక పోవడంతో కొంత మంది సీటు కోసం ఇతర పార్టీలకు వెళ్తున్నారని అన్నారు. అలాంటి వారిని తాము పట్టించుకోమని అన్నారు. అలాగే ఉత్తర ప్రదేశ్ ఎన్నికల్లో తమ పార్టీయే విజయం సాధిస్తుందన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..