తన ఎంపీ పదవికి అఖిలేష్ యాదవ్ రాజీనామా చేశారు. 2019సార్వత్రిక ఎలక్షన్ లో తూర్పు ఉత్తరప్రదేశ్‌లోని అజంగఢ్ నుంచి ఎంపీగా అఖిలేష్ యాదవ్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఇటీవల యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో కర్హాల్ నుంచి బరిలో నిలిచిన అఖిలేష్.. ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అయితే ఈ క్రమంలోనే ఏదో ఒక పదవిని వదులుకోవాల్సి రావడంతో.. అఖిలేష్ ఎంపీ పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు అఖిలేష్ యాదవ్.. తన రాజీనామా లేఖను లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు అందజేశారు. దీంతో అఖిలేష్ యాదవ్ ఎమ్మెల్యేగా కొనసాగనున్నారు. గతంలో సీఎంగా ఉన్న సమయంలో అఖిలేష్.. మండలి సభ్యునిగా కొనసాగారు. అయితే ఇటీవల యూపీ ఎన్నిల బరిలో నిలిచిన అఖిలేష్.. తొలిసారిగా అసెంబ్లీ ఎన్నికల పోరులో నిలిచినట్టయింది. అయితే తాజాగా ఎమ్మెల్యేగా కొనసాగేందుకు అఖిలేష్ నిర్ణయించుకోవడంతో.. సమాజ్‌వాద్ పార్టీ తరఫున ఆయన అసెంబ్లీలో పక్షనేతగా కొనసాగనున్నారు. బీజేపీ సర్కార్‌పై అసెంబ్లీ వేదికగా పోరాడాలనే నిర్ణయంతోనే అఖిలేష్ ఎమ్మెల్యేగా ఉండేందుకు మొగ్గు చూపినట్టుగా సమాజ్‌వాదీ పార్టీ వర్గాలు తెలిపాయి.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..