లక్నో : అఖిలేష్ యాదవ్ రథయాత్రకి శ్రీకారం చుట్టారు. దాంతో ఆయన రధయాత్రకి విశేష స్పందన వస్తోంది. అత్యాచారం కారణంగా దేశవ్యాప్తంగా కలకలం రేపిన ఉన్నావ్ లో అఖిలేష్ యాత్రకి ఆదరణ దక్కింది. అంతేకాదు పార్టీ కార్యకర్తల నుండి కూడా ఆయనకి బహుమానాలు వస్తున్నాయి. వాటిని అఖిలేష్ యాదవ్ స్వయంగా తీసుకున్నారు. ఈ బహుమానాల్లో చాలా మందిని ఆకర్షించింది.. హనుమాన్ చిత్రపటం. ఓ వ్యక్తి హనుమాన్ చిత్రపటాన్ని అందిస్తుండగా అఖిలేష్ యాదవ్ తీసుకుంటున్న ఫొటోపై చర్చ జరుగుతోంది. ఆ చిత్రపటంలో పార్టీ కార్యకర్త పేరుతోపాటు సమాజ్‌వాదీ పార్టీ ఎన్నికల గుర్తు సైకిల్ కూడా కనిపిస్తుంది. ఉత్తరప్రదేశ్ లో రథ యాత్రకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఇలాంటి రథ యాత్రతోనే బిజెపి బలమైన పార్టీగా ఆవిర్భవించిన సంగతి తెలిసిందే. ఇలాంటి రథ యాత్రతోనే బీజేపీ బలమైన పార్టీగా ఆవిర్భవించింది. 1990లలో ఎల్‌కే అద్వానీ ఉత్తరప్రదేశ్‌లో చేసిన రథ యాత్ర బీజేపీకి అనూహ్య మద్దతును తెచ్చిపెట్టింది. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు వచ్చే ఏడాది ఫిబ్రవరి, మార్చి నెలల్లో జరగనున్నాయి.
కోవిడ్-19 కొత్త వేరియంట్ కేసులు అధికంగా నమోదుకావడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో ఎన్నికల నిర్వహణపై ఆలోచించుకోవాలని న్యాయస్థానాలు ఎన్నికల సంఘానికి సూచిస్తున్నాయి. అయితే, ఒమిక్రాన్ కారణంగా వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరిగే 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు వాయిదాపడే అవకాశంలేదని ఎన్నికల సంఘం (ఈసీ) వర్గాలు తెలిపాయి. ఉత్తరప్రదేశ్, పంజాబ్, గోవా, ఉత్తరాఖండ్, మణిపూర్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని వెల్లడించాయి. ఎన్నికలు సమీపించడంతో పార్టీలు ప్రచార కార్యక్రమాల్లో మునిగిపోయాయి. ఇక్కడ అధికార బీజేపీతోపాటు సమాజ్‌వాదీ పార్టీ, బీఎస్పీ, కాంగ్రెస్‌లు ఈ ఎన్నికల బరిలో నిలిచి పోరాడనున్నాయి. బీజేపీ ఇప్పటికే పలు అభివృద్ధి కార్యక్రమాలతో అధికారాన్ని కొనసాగించడానికి ప్రయత్నాలు చేస్తుండగా, సమాజ్‌వాదీ పార్టీ తాము అధికారంలో ఉండగా జరిగిన అభివృద్ధి వల్లెవేస్తున్నది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..