Friday, November 22, 2024

సీఎం కేసీఆర్‌తో ముగిసిన అఖిలేష్‌ సమావేశం.. దేశంలో ప్ర‌త్య‌మ్నాయ ఎజెండాపై చ‌ర్చ‌

తెలంగాణ సీఎం కేసీఆర్‌తో సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్‌ యాదవ్ భేటీ ముగిసింది. రెండున్నర గంటలపాటు కొనసాగిన ఈ సమావేశంలో ఇరువురు నేతలు పలు జాతీయ అంశాలపై చర్చించుకున్నారు. ఇటీవల జరిగిన ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలపై ప్ర‌ధానంగా చర్చించినట్లు సమాచారం. దేశంలో ప్రత్యామ్నాయ ఎజెండా రూపకల్పన దిశగా ప్రయత్నాలు ప్రారంభించిన సీఎం కేసీఆర్‌.. అఖిలేశ్‌ యాదవ్‌తో ఇవ్వాల భేటీ అయ్యారు.

మధ్యాహ్నం 12.30 గంటలకు ఢిల్లీలోని కేసీఆర్ నివాసానికి చేరుకున్న ఆయనకు ముఖ్యమంత్రి సాదరంగా స్వాగతం పలికారు. ఈ సమావేశంలో మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి, ఎంపీలు సంతోష్‌ కుమార్‌, నామా నాగేశ్వర రావు, రంజిత్‌ రెడ్డి, వెంకటేష్‌ నేత పాల్గొన్నారు. సాయంత్రం 5 గంటలకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌తో సీఎం కేసీఆర్‌ సమావేశమవుతారు. అనంతరం కేజ్రీవాల్‌తో కలిసి రాజధానిలోని పలు ప్రదేశాలను సందర్శించనున్నారు. మొహల్లా క్లినిక్‌, దక్షిణ మోతీబాద్‌ సర్వోదయ పాఠశాలను సందర్శిస్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement