ఉత్తర్ ప్రదేశ్ లో సీఎం యోగి ఆదిత్యనాథ్ పాలనపై మాజీ ముఖ్యమంత్రి, సమాజ్ వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీలో అవినీతి జరిగిందన్నారు. వంద రోజుల యోగి పాలనలో డెవలప్ మెంట్ శూన్యమన్నారు. ఇప్పటి వరకు ఒక్క ఉద్యోగం రాలేదన్నారు. డిప్యూటీ సీఎంకు తెలియకుండానే శాఖను మార్చారన్నారు. యోగి సర్కార్ ను వెనుక నుంచి ఎవరో నడిపిస్తున్నారని అఖిలేష్ యాదవ్ అన్నారు.