ఆకాశ్ అంబానీ తండ్రి అయ్యారు. ఆయన భార్య శ్లోకా మెహతా పండంటి ఆడబిడ్డకి జన్మనిచ్చారు. వీరికి ఇది రెండో సంతానం. 2020 డిసెంబర్ లో శ్లోక కుమారుడికి జన్మనిచ్చారు. శ్లోకకు అమ్మాయి పుట్టినట్టు ముఖేశ్ అంబానీ సన్నిహితుడు, రాజ్యసభ సభ్యుడు పరిమళ్ నత్వానీ ట్విట్టర్ ద్వారా అధికారికంగా వెల్లడించారు. చిన్ని రాకుమారి ఇంట్లో అడుగుపెట్టిన శుభ సందర్భంగా ఆకాశ్, శ్లోకలకు హృదయపూర్వక శుభాకాంక్షలను తెలియజేస్తున్నానని చెప్పారు. మరోవైపు తమకు మనవరాలు పుట్టిన సందర్భంగా ముఖేశ్ అంబానీ తన కుటుంబసభ్యులతో కలిసి ముంబైలోని శ్రీ సిద్ధివినాయక ఆలయంలో ప్రత్యేక పూజలను నిర్వహించారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement