Saturday, November 23, 2024

ఎయిర్ టెల్ విత్ నోకియా.. 5జి ట్రయల్స్ షురూ..

ప్ర‌భ‌న్యూస్ : నోకియా భాగస్వామ్యంతో దేశంలో తొలిసారి 700 ఎంహెచ్‌జెడ్‌ స్పెక్ట్రమ్‌ బ్యాండ్‌లో 5జీ ట్రయల్‌ నిర్వహించినట్టు దేశీయ టెలికం ఆపరేటర్‌ భారతీ ఎయిర్‌టెల్‌ ప్రకటించింది. కలకత్తా శివార్లు ఈ ట్రయల్స్‌ నిర్వహించామని, తూర్పు భారతదేశంలో కూడా 5జీ ట్రయల్స్‌ నిర్వహించామని ప్రకటనలో ఎయిర్‌టెల్‌ పేర్కొంది. కాగా వ్యాలిడేషన్‌ 5జీ టెక్నాలజీ, వినియోగం కోసం బహుళ బ్యాండ్‌ల స్పెక్ట్రాన్ని ఎయిర్‌టెల్‌కు డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ టెలికమ్యూనికేషన్స్‌ కేటాయించిన విషయం తెలిసిందే. నోకియా 5జీ పోర్ట్‌ఫోలియోకు చెందిన పరికరాలను ఎయిర్‌టెల్‌ వినియోగించుకుంది.

ఎక్విప్‌మెంట్‌ జాబితాలో నోకియా ఎయిర్‌స్కేల్‌ రేడియోస్‌, ఎస్‌ఏ(స్టాండా లోన్‌) కోర్‌ ఉన్నాయి. కాగా ఆర్థిక సంవత్సరం 2022లో భారతీ ఎయిర్‌ టల్‌ స్థూల వ్యయం దాదాపు 5 బిలియన్‌ డాలర్లకు పెరిగే అవకాశం ఉందని గ్లోబల్‌ రేటింగ్‌ ఏజెన్సీ ఫిచ్‌ అంచనా వేసింది. సునీల్‌ మిట్టల్‌ సారధ్యంలో ఈ టెల్కోకంపెనీ.. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో జరగబో యే 5జీ ఎయిర్‌వేవ్స్‌ వేలం చెల్లింపుల కోసం 1.5 బిలియన్‌ డాలర్లు వెచ్చించే అవకాశం ఉందని పేర్కొంది. ఎయిర్‌టెల్‌ దీర్ఘకాల ఫారెన్‌ కరెన్సీ ఇష్యూయర్‌ డీఫాల్ట్‌ రేటింగ్‌(ఐడీఆర్‌)కు బీబీబీ రేటింగ్‌ ఇచ్చింది. అయితే నేగిటివ్‌ ఔట్‌లుక్‌గా పేర్కొంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement